Manish Sisodia: నాపై తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి తేవడం వల్లే సీబీఐ అధికారి ఆత్మహత్య: మనీష్ సిసోడియా

తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసేలా ఒత్తిడి తేవడం వల్లే ఒక సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. అధికారులపై తన కేసు విషయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Manish Sisodia: నాపై తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి తేవడం వల్లే సీబీఐ అధికారి ఆత్మహత్య: మనీష్ సిసోడియా

Manish Sisodia: తనను అరెస్టు చేసేలా తప్పుడు కేసు పెట్టాలి అని ఒత్తిడి తేవడం వల్లే ఒక సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. సీబీఐ విభాగంలో డిప్యూటీ లీగల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న జితేంద్ర కుమార్ అనే అధికారి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.

TTD: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దు.. భక్తులకు టీటీడీ సూచన

తన కేసుకు సంబంధించి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని మనీష్ సిసోడియా చెప్పారు. ఈ అంశంపై మనీష్ సిసోడియా సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై నమోదైన కేసు విషయంలో అరెస్టు చేసేలా తప్పుడు కేసు పెట్టాలని ఒక సీబీఐ అధికారిపై ఒత్తిడి తెచ్చారు. దీనికి అతడు అంగీకరించలేదు. ఒత్తిడి తట్టుకోలేక తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో ఎంతో కలత చెందా’’ అని మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. అయితే, మనీష్ చేసిన ఆరోపణల్ని సీబీఐ ఖండించింది. ఆయన ఆరోపణలు తప్పుదోవపట్టించేవిధంగా ఉన్నాయని చెప్పింది. ఆత్మహత్య చేసుకున్న జితేంద్ర కుమార్ అనే వ్యక్తికి, మనీష్ సిసోడియా కేసుకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ వెల్లడించింది.

Pakistan floods: పాకిస్తాన్‌లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది

మనీష్ సిసోడియాకు సంబంధించి కేసు విచారణ కొనసాగుతోందని, ఈ కేసులో ఇంకా ఎవ్వరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి జరిగిన అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ మనీష్ సిసోడియాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.