TTD: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దు.. భక్తులకు టీటీడీ సూచన

ఈ నెల 27 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ సూచించింది.

TTD: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దు.. భక్తులకు టీటీడీ సూచన

TTD: భక్తులు అందించే కానుకల విషయంలో టీటీడీ ఒక సూచన చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ సూచించింది.

Pakistan floods: పాకిస్తాన్‌లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది

ఈ సమయంలో భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, వాటితో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాగా, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 8-10 వరకు, మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 7 సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్య హవచనం, మృత్సంగ్ర‌హణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగుతుంది.

BiggBoss6 : మొదటి రోజే గొడవలు మొదలు.. ఈ జుట్టు పంచాయితీ ఏందో.. రెచ్చిపోయిన గీతూ..

ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ.. సిబ్బంది వల్ల గానీ పొరపాటున కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఈ తప్పుల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.