Covaxin: కొవాగ్జిన్ తీసుకుంటే క్వారంటైన్‌లో ఉండక్కర్లేదు.. ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత!

ఒమన్ దేశం ట్రావెల్ నిబంధనల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Covaxin: కొవాగ్జిన్ తీసుకుంటే క్వారంటైన్‌లో ఉండక్కర్లేదు.. ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత!

Covaxin Clearance

Updated On : October 28, 2021 / 7:14 AM IST

Covaxin: ఒమన్ దేశం ట్రావెల్ నిబంధనల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ వినిపించింది. భారత్‌లో ఎక్కువగా హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ని వేసుకున్న సంగతి తెలిసింది. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటివరకు పలుదేశాలు అనుమతి ఇవ్వలేదు. అయితే, లేటెస్ట్‌గా స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ని ఒమన్‌ గుర్తించింది.

కోవాగ్జిన్ డోసు తీసుకున్న ప్రయాణీకులు ఇకపై ఒమన్‌లో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, కొవాగ్జిన్ తీసుకున్నవారిపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో తయారైన కోవాగ్జిన్ తీసుకున్నవారు ఇకపై ఒమన్‌లో ఎక్కడైనా తిరగొచ్చు.

ఈ మేరకు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ట్వీట్‌ చేసింది. క్వారంటైన్ అవసరం లేకుండా ఒమన్‌లో ప్రయాణించడానికి కోవాగ్జిన్‌ను ఆమోదించినట్లు కార్యాలయం చెప్పింది. ఒమన్ ఆమోదించిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ల జాబితాలో కొవాగ్జిన్‌ను చేర్చినట్లు చెప్పింది అక్కడి ప్రభుత్వం. ప్రయాణ తేదీకి రెండు వారాల ముందు కోవాగ్జిన్ రెండు డోసులను తీసుకుని ఉంటే, వారు ఒమన్‌కు ప్రయాణించవచ్చు.

అయితే, RT-PCR పరీక్ష మాత్రం కచ్చితంగా చేయించుకుని ఉండాల్సిందే. ఈ ప్రకటన తర్వాత ప్రపంచకప్ చూసేందుకు ఒమన్‌కు వెళ్లాలని చూస్తున్న భారతీయులు సంతోషంగా ఉన్నారు. AstraZeneca/Covishield తీసుకున్న ప్రయాణికులు ఇప్పటికే క్వారంటైన్ లేకుండా ఒమన్‌కు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.