ఏప్రిల్ 20 నాటికి రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇవే 

  • Publish Date - April 21, 2020 / 09:56 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు వస్తున్నాయి. ఒకవైపు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతున్నప్పటికీ కొత్త కేసులతో వస్తుండటంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మే 3 వరకు కేంద్రం లాక్ డౌన్ పొడిగించగా.. కరోనా కేసుల్లో ఏమాత్రం తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించడం లేదు.. లాక్ డౌన్ ముగిసే నాటికి కరోనా కేసుల సంఖ్య తగ్గేలా కనిపించడం లేదు. 

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కరోనాను నియంత్రణ చర్యలను వేగవంతం చేశాయి. వివిధ రాష్ట్రాల వారీగా నమోదైన కేసులు నమోదు కావడంతో ప్రతి పదిలక్షల మంది జనాభాకూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.

రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులతో పాటు మృతుల వివరాలకు సంబంధించి పట్టికను విడుదల చేసింది. ఏయే రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 వరకు కరోనా కేసులు, మరణాలు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 18వేల 658 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 592 మంది మృతిచెందారు.

ఆంధ్రప్రదేశ్‌లో 757 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 మంది మరణించారు. 715 మందికి టెస్టులు నిర్వహించారు. 
అస్సాంలో 35 కేసులు, ఒకరు మృతిచెందగా, 165 మందికి పరీక్షలు చేశారు. 
బిహార్ లో 113 కేసులు, 2 మృతిచెందారు.. 114 మందికి పరీక్షలు 
చత్తీస్ గఢ్ లో 36 కేసులు, 262మందికి పరీక్షలు నిర్వహించారు.
గుజరాత్ లో 1939 మందికి పాజిటివ్ కేసులు, 71మంది మృతిచెందగా, 546 మందికి పరీక్షలు చేశారు.
హర్యాణాలో 251 మందికి పాజిటివ్ కేసులు, 3 మృతిచెందారు.. 463మందికి పరీక్షలు
హిమాచల్ ప్రదేశ్‌లో 39 కేసులు, 2 మృతులు, 422 మందికి పరీక్షలు
జార్ఖండ్ లో 45 కొత్త కేసులు, ఇద్దరు మృతి, 114మందికి పరీక్షలు
కర్ణాటకలో 408 కేసులు, 16మంది మృతి, 367మందికి పరీక్షలు
కేరళలో 407 కేసులు, ఇద్దరు మృతి, 581 మందికి పరీక్షలు
మధ్యప్రదేశ్‌లో  1485 కేసులు, 76 మంది మృతి, 379మందికి పరీక్షలు
మహారాష్ట్రలో 4666 కేసులు, 232 మంది మృతి, 626 మందికి పరీక్షలు చేశారు.
ఒడిషాలో 79 కేసులు, ఒకరు మృతి, 247మందికి పరీక్షలు 
పంజాబ్ లో 250 కేసులు, 16 మంది మృతి, 233మందికి పరీక్షలు
రాజస్థాన్‌లో 1628 కేసులు, 25 మంది మృతి, 830 మందికి కరోనా పరీక్షలు
తమిళనాడులో 1520 కేసులు, 17 మంది మృతి, 692 మందికి పరీక్షలు
తెలంగాణలో 872 కేసులు, 23 మంది మృతి, 375 మందికి పరీక్షలు
యూపీలో 1184 కేసులు, 18మంది మృతి, 167 మందికి పరీక్షలు
ఉత్తరాఖండ్ లో 46 కేసులు, 321 మందికి పరీక్షలు
పశ్చిమ బెంగాల్ లో 392 కేసులు, 12మంది మృతి, 61 మందికి పరీక్షలు 

కేంద్ర పాలిత ప్రాంతాలు : 
ఢిల్లీలో 2081 కేసులు, 47 మంది మృతి, 1363 మందికి పరీక్షలు
జమ్మూ కశ్మీర్ లో 368 కేసులు, 5 మంది మృతి, 689 మందికి పరీక్షలు
చండీగఢ్ లో 26 కేసులు, 420 మందికి పరీక్షలు నిర్వహించారు.