Lockdown : కరోనా తగ్గుముఖం, అన్‌లాక్ దిశగా రాష్ట్రాలు
ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు...ఈ మూడు రాష్ట్రాల్లోనూ కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు విజృంభించాయి. మృత్యుఘోష మార్మోగింది. ఇప్పుడీ మూడు రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Unlock
COVID-19 : ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు…ఈ మూడు రాష్ట్రాల్లోనూ కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు విజృంభించాయి. మృత్యుఘోష మార్మోగింది. ఇప్పుడీ మూడు రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలను సడలించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో మూతబడిన నేషనల్ పార్క్‌లు, టైగర్ రిజర్వ్‌లను జూన్ 1 నుంచి తిరిగి తెరవనున్నారు. కోవిడ్ వ్యాప్తితో రెండు నెలలుగా మూతబడ్డ పార్క్‌లు, రిజర్వ్‌లను జూన్ 1 నుంచి జూన్ 30 వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే పర్యాటకులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
తమిళనాడులోని స్టాలిన్ సర్కార్..జూన్ 7 వరకు లాక్‌డౌన్‌ను అమలులో ఉంచాలని నిర్ణయించింది. అయితే కొన్ని సడలింపులను ప్రకటించింది. కోయంబేడు సహా జిల్లాల్లో ఉన్న కూరగాయలు, పండ్లు, పూల హోల్‌సేల్ మార్కెట్లను తెరిచేందురకు అనుమతి ఇచ్చింది. పలు శాఖల సమన్వయంతో వాహనాల ద్వారా తమిళనాడు అంతటా కోయంబేడు నుంచి సరుకు వెళ్లనుంది. నివాస ప్రాంతాల్లో కిరాణా, పాలు, కూరగాయలను ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలపై అమ్ముకోవచ్చు.
ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి తేవడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజుకు 30 వేలకు పైగా కేసుల నమోదుతో తల్లడిల్లిన ఢిల్లీలో తొలిసారి వెయ్యి లోపు కేసులు నమోదవడంతో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసేందుకు ఆప్ సర్కార్ నిర్ణయించింది. 2021, మే 31వ తేదీ సోమవారం ఉదయం నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వలస కార్మికుల సంక్షేమం దృష్ట్యా నిర్మాణ రంగ కార్యకలాపాలు, పరిశ్రమలు తెరిచేందుకు అనుమతి ఇస్తామన్నారు సీఎం కేజ్రీవాల్.
పాజిటివిటీ రేటు తగ్గడం, రికవరీ రేటు పెరగడంతో మరిన్ని రాష్ట్రాలు అన్‌లాక్ దిశగా అడుగులేయవచ్చని తెలుస్తోంది. అయితే ప్రజలు నిర్లక్ష్యం వహించినా, కోవిడ్ నిబంధనలు పాటించకపోయినా మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదముందని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కేసులు పెరిగితే మళ్లీ లాక్‌డౌన్ విధిస్తామని చెబుతున్నాయి.
Read More : AP CM YS Jagan : రెండేళ్లలో 95 శాతం హామీలు పూర్తిచేశాము