COVID-19 vaccine to be provided free : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా..అది ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందా ? లేదా ? అనే చర్చ కొనసాగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్. కోవిడ్ – 19 వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మొద్దని సూచించారు. ప్రజల భద్రత ముఖ్యమని చెప్పారు.
2021, జనవరి 02వ తేదీ శనివారం..భారతదేశ వ్యాప్తంగా..కోవిడ్ – 19 వ్యాక్సిన్ డ్రైన్ రన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ హాస్పిటల్ ను మంత్రి హర్షవర్ధన్ సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ప్రజలకు ఉచితంగా..వ్యాక్సిన్ అందిస్తామని చెప్పడం విశేషం. కోవిషీల్డ్ వినియోగానికి నిపుణులు కమిటీ సిఫార్సు చేస్తుందని, పొలియో ఇమ్యుజేన్ జరిగే సమయంలో ఇలాంటి వదంతులు ప్రచారమయ్యాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకున్నట్లు, భారతదేశం పోలియో నుంచి విముక్తి పొందారని తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతున్న రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు, దీని ప్రకారం..నూతన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామన్నారు. ఈ ప్రకారమే..అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శనివారం డ్రై రన్ జరుగుతోందని చెప్పారు.