Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. రోజురోజుకీ మ్యుటేషన్లు చెందుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ కూడా కొవిడ్ బూస్టర్ డోసును ఇవ్వనన్నట్టు ప్రకటించింది.

Covid Booster Dose : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. రోజురోజుకీ మ్యుటేషన్లు చెందుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ల విజృంభణతో భారత్ సహా అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరగాలన్నారు. ఇప్పటికే కొవిడ్ టీకా రెండు డోసులు అందించగా.. అదనంగా మూడో బూస్టర్ డోసు కూడా అందించే దిశగా ప్రయత్నాలు మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా కొవిడ్ బూస్టర్ డోసును ఇవ్వనన్నట్టు ప్రకటించింది. అయితే ఈ డోసు అందరికి కాదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?
జనవరి 10, 2022 నుంచి కోవిడ్-19 precautionary dose దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

బూస్టర్ షాట్‌లకు అర్హత :
జనవరి 10 నుంచి నిర్వహించే precaution dose మోతాదుకు హెల్త్‌కేర్ ఫ్రంట్‌లైన్ వర్కర్లు అర్హులు.. ఈ బూస్టర్ డోసును వయస్సు 60 ఏళ్లు పైబడిన పౌరులు పొందవచ్చు. వైద్యుడు సలహా మేరకు comorbidities కూడా పొందవచ్చు.

ఏయే పత్రాలు అవసరమంటే? :
సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోసుకు అర్హత పొందాలంటే.. తమ అనారోగ్య సమస్యలకు సంబంధించి వైద్య ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. స్కాన్ చేసి CoWIN పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు లేదా వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఉత్పత్తి చేయవచ్చు.

రెండో డోసుకు బూస్టర్ డోసుకు మధ్య గ్యాప్ ఎంతంటే? :
నివేదిక ప్రకారం.. COVID-19 వ్యాక్సిన్ రెండవ డోస్ మోతాదు తర్వాత మూడో డోస్ వేయాలంటే మధ్య గ్యాప్ 9 నుంచి 12 నెలలు ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

CoWINలో కోవిడ్-19 బూస్టర్ డోసు ఎలా బుక్ చేసుకోవాలి :
అనారోగ్య సమస్యలతో బాధపడుతన్న comorbidities బాధితుల్లో 45-ప్లస్ కేటగిరీ వ్యక్తుల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని CoWIN ప్లాట్‌ఫారమ్‌ నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. అధికారిక డేటా ప్రకారం.. కనీసం 137.5 మిలియన్ల మంది 60 ఏళ్లు పైబడిన బాధితులంతా కోవిడ్ బూస్టర్ అర్హులుగా చెప్పవచ్చు.

Read Also : Vijayawada : వైద్య పరికరాల చీటింగ్ కేసు-విజయవాడలో రూ.23 లక్షల మోసం

ట్రెండింగ్ వార్తలు