Vijayawada : వైద్య పరికరాల చీటింగ్ కేసు-విజయవాడలో రూ.23 లక్షల మోసం
విజయవాడలో కొద్దిరోజుల క్రితం వెలుగు చూసిన వైద్యపరికరాలు అద్దె ఇచ్చే ఆన్‌లైన్ చీటింగ్ కేసులో ఇప్పటి వరకు 22 కేసులు నమోదయ్యాయని సైబర క్రైమ్ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

Vijayawada Cyber Crime
Cyber Crime Vijayawada : విజయవాడలో కొద్దిరోజుల క్రితం వెలుగు చూసిన వైద్యపరికరాలు అద్దెకు ఇచ్చే ఆన్‌లైన్ చీటింగ్ కేసులో ఇప్పటి వరకు 22 కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైమ్ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులు లవ్ లైఫ్ అండ్ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో ప్రజల వద్దనుంచి పెద్ద ఎత్తున డబ్బులు కాజేశారు.
తలైవా డాట్ కాం. అనే వెబ్ సైట్ ద్వారా లవ్ లైఫ్ అనే అప్లికేషన్ ను క్రియేట్ చేశారని… ఇది ప్రీ ప్లాన్ డ్ గా చేసిన మోసమని ఆయన తెలిపారు. మొదట్లో వైద్య పరికరాలు కొన్న వారికి రిటర్న్స్ బాగానే ఇచ్చారని దీంతో ఎక్కువ మంది ప్రజలు అందులో పెట్టుబడులు పెట్టి వైద్యపరికరాలు కొనుగోలు చేయటం మొదలెట్టారు. ఒక్కోక్కరూ రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు.
Also Read : AP Cyber Crime : లవ్ లైఫ్..ప్రేమే జీవితమంటూ..కోట్ల రూపాయల మోసం
ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రూ.23 లక్షల రూపాయలు మోసంజరిగినట్లు బయటపడింది. ఇంకెందరు ఉన్నారో లెక్క తేలాల్సిఉంది. ఎకౌంట్ లావాదేవీలపై జరిగిన మోసంపై విచారణ జరుగుతోంది. మోసపోయిన వాళ్లలో అధికాశాతం చదువుకున్న వాళ్లే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేకమంది బాధితులు ఉన్నట్లు తెలిసిందని ఎస్సై తెలిపారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిర్వాహాకులను పట్టుకుంటామని సులభంగా వచ్చే ఇలాంటి వాటికి ఆశపడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఆయన అన్నారు.