AP Cyber Crime : లవ్ లైఫ్..ప్రేమే జీవితమంటూ..కోట్ల రూపాయల మోసం

క్రిస్‌మస్‌ సందర్భంగా స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా ఇచ్చారు. దీంతో ఎగబడీ మరీ డబ్బులు కేటుగాళ్ల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆదివారం వరకు సజావుగా పనిచేసిన అప్లికేషన్‌...

AP Cyber Crime : లవ్ లైఫ్..ప్రేమే జీవితమంటూ..కోట్ల రూపాయల మోసం

Cyber Crime

Love Life Mobile Application Scam: ఎవరినీ నమ్మవద్దు..ఆన్ లైన్ లో మోసాలు జరుగుతున్నాయి..ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి మెసేజ్ వచ్చినా పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే..నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నా..కొంతమంది పట్టించుకోవడం లేదు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీ ఇస్తామని చెప్పడంతో నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అధికవడ్డీ ఆశ చూపితేచాలు.. వెనుకాముందు ఆలోచించకుండా డబ్బులన్నీ ధారపోస్తున్నారు. ఈ తరహా మోసమే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది.

Read More :Telangana Omicron : సిరిసిల్ల జిల్లాలో మూడు ఒమిక్రాన్ కేసులు..టిమ్స్ ఆసుపత్రికి తరలింపు

లవ్‌ లైఫ్‌.. ప్రేమే జీవితం అంటూ నేచురల్స్‌ యాప్‌ ద్వారా మోసానికి స్కెచ్‌ వేశారు కేటుగాళ్లు. మెడికల్‌ పరికరాలను ఆన్‌లైన్‌ వేదికగా అద్దెకు తిప్పుతూ…. కొనుగోలు చేసిన వ్యక్తులకు షేర్స్‌ ఇస్తున్నట్టు నమ్మబలికారు. ఇది నమ్మి చాలా మంది లక్షల్లో సమర్పించుకున్నారు. ముక్కూ తెలియదు, మొహం తెలియదు. ఆన్‌లైన్‌ యాప్‌ వేదికగా అధిక వడ్డీ, కమిషన్‌ ఇస్తామని చెప్తే.. నమ్మి లక్షలు ఇచ్చారు. కొంతకాలం వరకు కమీషన్స్‌ క్రమం తప్పకుండా ఇచ్చారు. మరికొంత మందిని చేర్పిస్తే కమీషన్‌ మరింత వస్తుందని నమ్మించారు. దీంతో తెలిసిన వారినీ, కుటుంబ సభ్యులను, బంధువులను కూడా ఇందులో చేర్చారు కొంతమంది. దీంతో యాప్‌ నిర్వాహకులకు పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాయి.

Read More : Weather Forecast : తెలంగాణా‌లో రేపు, ఎల్లుండి తేలిక పాటి వర్షాలు..ఏపీలో పొడి వాతావరణం

క్రిస్‌మస్‌ సందర్భంగా స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా ఇచ్చారు. దీంతో ఎగబడీ మరీ డబ్బులు కేటుగాళ్ల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆదివారం వరకు సజావుగా పనిచేసిన అప్లికేషన్‌.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది. తెల్లారినా పనిచేయలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బాధితులు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. గుజరాత్‌ కేంద్రంగా ఈ భారీ మోసం జరిగినట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మోసపోయిన బాధితులు 20 లక్షల మంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో నిందితుల కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి.