Covid Danger: ఆ జీన్ ఉన్న 27 శాతం మంది భారతీయులకు కరోనా పెనుముప్పు

మనుషుల్లో ఒకరకమైన జన్యువు ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని..ఆ జన్యువు ఉన్నవారు వైరస్ భారిన పడితే త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది

Covid Danger: ఆ జీన్ ఉన్న 27 శాతం మంది భారతీయులకు కరోనా పెనుముప్పు

Covid

Updated On : January 14, 2022 / 8:19 PM IST

Covid Danger: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. రూపాలు మార్చుకుని ప్రజలపై తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తుంది. మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. ఇటువంటి సమయంలో కరోనా తీవ్రతపై జరిపిన పరిశోధనల్లో వెలువడిన ఫలితాలు వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి. కరోనా మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. వైరస్ తీవ్రతను పసిగట్టే విధంగా జన్యువు పరిశోధన చేపట్టారు. పోలాండ్ కు చెందిన “బయాలిస్టాక్‌ మెడికల్ యూనివర్శిటీ” శాస్త్రవేత్తలు Covid – 19పై జన్యు పరమైన పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన ప్రకారం కరోనా వైరస్ తీవ్రత మనుషుల లింగం, వయసు, బరువు తరువాత జన్యువులపై ఉన్నట్లు గుర్తించారు.

Also read: Six Air Bags: వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసిన కేంద్రం

మనుషుల్లో ఒకరకమైన జన్యువు ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని..ఆ జన్యువు ఉన్నవారు వైరస్ భారిన పడితే త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని “బయాలిస్టాక్‌ మెడికల్ యూనివర్శిటీ” పరిశోధనలు తెలిపాయి. ఆరకమైన జన్యువు ఉన్న వారు.. పోలాండ్ దేశంలో 14 శాతం మంది ఉండగా.. యూరోప్ ఖండంలో 9 శాతం మంది ఉన్నారు. ఇక భారత్ లో దాదాపు 27 శాతం మంది ఆ జన్యువు కలిగి ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వీరుగనుక వైరస్ భారిన చిక్కుకుంటే.. వారి ప్రాణానికే ప్రమాదం ఉందని పరిశోధనలో పేర్కొన్నారు. కాగా పోలాండ్ దేశంలో ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రజలు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. జన్యు పరమైన పరిశోధనలు జరపడం వలన.. మనుషులపై కరోనా తీవ్రతను పసిగట్టి, ప్రాణాలను నిలబెట్టవచ్చని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.

Also read: Flight Accident: దుబాయ్ రన్ వే పై ఎదురెదురుగా విమానాలు, తృటిలో తప్పిన ప్రమాదం