Six Air Bags: వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసిన కేంద్రం

8 మంది లోపు ప్రయాణికులను తరలించే అన్ని వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముసాయిదా GSR నోటిఫికేషన్ పై సంతకం చేశారు.

Six Air Bags: వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసిన కేంద్రం

Airbags

Six Air Bags: అన్నిరకాల ప్యాసింజర్ల వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 8 మంది లోపు ప్రయాణికులను తరలించే అన్ని వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముసాయిదా GSR నోటిఫికేషన్ పై సంతకం చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా వివరాలు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

Also read: Flight Accident: దుబాయ్ రన్ వే పై ఎదురెదురుగా విమానాలు, తృటిలో తప్పిన ప్రమాదం

కాగా 2019 జులై 1 నుంచి అన్ని వాణిజ్య వాహనాల్లో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయగా.. 2022 జనవరి 1 నుంచి ప్యాసింజర్ వైపు కూడా ఎయిర్ బ్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. అయితే M1 వాహనం విభాగంలో మరో 4 అదనపు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయాలని నిర్ణయించడంతో తదుపరి ఆదేశాలు జారీ చేశారు. “భారతదేశంలో మోటారు వాహనాలను గతంలో కంటే సురక్షితంగా చేయడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని” కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల్లో ముందు కూర్చున్న ఇద్దరు ప్రయాణికులతో పాటు, వెనుక కూర్చున్న ప్రయాణికుల రక్షణ నిమిత్తం ఈ ఆరు ఎయిర్ బ్యాగులు ఉపయోగపడుతాయని ఆయన అన్నారు.

Also read: Baby Shark: యూట్యూబ్ లో 10 బిలియన్ వ్యూస్ తో “బేబీ షార్క్” సెన్సేషన్

కాగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవం 2022లో భాగంగా జనవరి 11 నుంచి 18 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత వంటి అంశాలపై అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది.

Also read: Kadapa Politics: ప్రొద్దుటూరు వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు