Covid Second Wave : మే చివరి వరకే సెకండ్ వేవ్‌

నెల రోజులుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా నెమ్మదిస్తోందంటూ ఘంటాపథంగా చెబుతున్నారు ముంబై ఐఐటీ ప్రొఫెసర్లు. ముంబై ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ మే చివరి నాటికి కరోనా కంట్రోల్‌కి వస్తుందన్నారు.

Covid Second Wave Spread Will Stop Slowly By May End

Covid Second Wave Spread : నెల రోజులుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా నెమ్మదిస్తోందంటూ ఘంటాపథంగా చెబుతున్నారు ముంబై ఐఐటీ ప్రొఫెసర్లు. ముంబై ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ మే చివరి నాటికి కరోనా కంట్రోల్‌కి వస్తుందన్నారు. కరోనా కేసులు హెచ్చుతగ్గులపై తాము అనుసరించిన సూత్ర మోడల్‌లో ఇదే విషయం వెల్లడైందన్నారు. దేశంలో మే చివరి నాటికి రోజువారి కేసుల సంఖ్య లక్షన్నర కంటే కిందికి పడిపోతాయన్నారు.

ఇప్పటికే కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైందని.. మే చివరి నాటికి ఈ విషయంలో పూర్తి స్థాయి స్పష్టత వస్తుందంటున్నారు ఐఐటీ ప్రొఫెసర్‌. దాదాపుగా దేశంలో కరోనా పీక్‌ స్టేజ్‌ చేరుకుని తగ్గుతుందన్నారు. అయితే ఈ తగ్గుదల దేశవ్యాప్తంగా ఒకే తీరుగా లేదన్నారు. ఇప్పటికే పీక్‌ స్టేజ్‌ చేసిన మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, బీహార్‌, హర్యానా, పంజాబ్‌, జమ్ము, కశ్మీర్‌లకు కరోనా గండం గడిచినట్టే అన్నారు. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కేసులు పెరుగుతున్నాయని.. ఆ రాష్ట్రాలకు ఇంకా ముప్పు తొలగిపోలేదన్నారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 2లక్షల 81 వేల 367 కేసులు వచ్చాయని దాదాపుగా 26 రోజుల తర్వాత తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయన్నారు. సెకండ్‌ వేవ్‌ ముగుస్తుందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నా థర్డ్‌ వేవ్‌ ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై ఇంకా పూర్తిస్థాయిలో సర్వే చేయలేదన్నారు. వ్యాక్సినేషన్‌ వేగంగా చేయడం ద్వారా థర్డ్‌ వేవ్‌ ముప్పును సమర్థంగా ఎదుర్కొవచ్చాన్నారు.