Cremations on Varanasi streets
Varanasi Rains : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో వీధుల్లోనే శవాలకు అంత్యక్రియలు చేశారు. భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న గంగానది నీటి మట్టంతో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలోని ప్రసిద్ధ ఘాట్‌లు మునిగిపోయాయి. దీంతో స్థానికులు మృతదేహాలను వీధుల్లో దహనం చేయవలసి వచ్చింది. (Cremations on Varanasi streets) గంగా నదీ తీరంలోని 84 ఘాట్‌లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. (Heavy Rain Floods)
Delhi fire : ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 9మందికి గాయాలు
వారణాసి ఘాట్‌లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో పూజారులు హారతి చేసే ప్రదేశాన్ని కూడా మార్చారు. (Ganga ghats in Varanasi) వారణాసిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా నది ప్రమాదకర స్థాయికి దిగువన ప్రవహిస్తోంది. వరద ముప్పు దృష్ట్యా పడవ కార్యకలాపాలను కూడా నిషేధించారు.
Lokayukta Raids : స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త దాడి…రూ.10కోట్ల అక్రమ ఆస్తులు
గంగా ఘాట్‌పై ఆధారపడి జీవిస్తున్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంగానదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 1,000కు పైగా చిన్న, పెద్ద పడవలు, మోటర్‌బోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరద కారణంగా తమ జీవనోపాధి దెబ్బతిందని హరిశ్చంద్ర ఘాట్‌కు చెందిన బోట్‌మెన్ గులాబ్ సాహ్ని ఆవేదనగా చెప్పారు.