Lokayukta Raids : స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త దాడి…రూ.10కోట్ల అక్రమ ఆస్తులు

వైద్యఆరోగ్యశాఖలో సాధారణ స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు చేస్తే షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. నెలకు కేవలం రూ.45వేల జీతంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అష్ఫాక్ అలీ స్టోర్ కీపరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అలీ ఇంటిపై దాడి చేయగా అతని వద్ద రూ.10 కోట్ల అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి....

Lokayukta Raids : స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త దాడి…రూ.10కోట్ల అక్రమ ఆస్తులు

Lokayukta Raids

Lokayukta Raids : వైద్యఆరోగ్యశాఖలో సాధారణ స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు చేస్తే షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. నెలకు కేవలం రూ.45వేల జీతంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అష్ఫాక్ అలీ స్టోర్ కీపరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అలీ ఇంటిపై దాడి చేయగా అతని వద్ద రూ.10 కోట్ల అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. (10 cr assets found in raids) ఈ దాడిలో అష్ఫాక్ అలీ ఇంట్లో రూ.46 లక్షల విలువైన బంగారం, వెండి, రూ.20 లక్షల నగదు లభ్యమయ్యాయి.

Jammu-Srinagar : రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు..అమరనాథ్ యాత్రకు బ్రేక్

భోపాల్‌లోని అష్ఫాక్ అలీ ఇంట్లో మాడ్యులర్ కిచెన్, లక్షల రూపాయల విలువైన షాన్డీలియర్, ఖరీదైన సోఫాలు, షోకేసులు, రిఫ్రిజిరేటర్, టెలివిజన్ ఉన్నాయి. (Madhya Pradesh officer) అష్ఫాక్ అలీ గతంలో రాజ్‌గఢ్‌లోని జిల్లా ఆసుపత్రిలో స్టోర్ కీపర్‌గా పనిచేశారని లోకాయుక్త అధికారులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో లోకాయుక్త విభాగం అధికారులు దాడులు నిర్వహించగా, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. (Lokayukta Raids)

Pakistan : జాతీయ అసెంబ్లీని రద్దు చేయండి.. పాక్ ప్రధాని లేఖ

మొత్తం అతని ఆస్తుల విలువ రూ.10 కోట్లు ఉంటుందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అలీ, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె పేరిట రూ.1.25 కోట్ల విలువైన 16 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు కూడా ఆయన ఇంటి సోదాలో బయటపడ్డాయి. 14,000 చదరపు అడుగుల స్థలంలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, ఒక ఎకరం స్థలం, ఒక పెద్ద భవనం ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని అష్ఫాక్‌ అలీపై ఫిర్యాదు రావడంతో దాడులు నిర్వహించారు. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.