Dhonis helecopter chocolates : ధనా ధన్ ధోనీ హెలికాప్ట‌ర్ షాట్ చాక్లెట్లు.. !!

Dhonis helecopter chocolates : ధనా ధన్ ధోనీ హెలికాప్ట‌ర్ షాట్ చాక్లెట్లు.. !!

Dhonis Helecopter Chocolates

Updated On : April 7, 2021 / 12:33 AM IST

Dhonis helecopter chocolates : ధోనీ పరిచయం అవసరం లేని యూనిక్ నేమ్. మిస్టర్ కూల్ ఆటలో దిగాడంటే ఆట తప్ప మరో ధ్యాస లేని క్రీడాకారుడు. ధోనీ హెలికాప్టర్ షాట్ అంటే అభిమానులు వెర్రెత్తిపోతారు. ఇండియ‌ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ హెలికాప్ట‌ర్ షాట్‌కు ఫిదా కాని వాళ్లు ఉండ‌రు అంటే అతిశయోక్తి కాదు. ధనా ధన్ ధోనీ షాట్ నుంచి యువ క్రికెట‌ర్లే కాదు చాక్లెట్ బ్రాండ్లు కూడా ఫిదా అయిపోయాయి. అందుకే ధోనీ హెలికాప్ట‌ర్ షాట్‌, అత‌ని జెర్సీ నంబ‌రే స్ఫూర్తిగా ఓ చాక్లెట్ మార్కెట్‌లోకి దూసుకొచ్చింది. ఆయన కొట్టే హెలికాప్టర్ షాట్ లాగా.

ఈ చాక్లెట్ పేరు కాప్ట‌ర్‌7. చాక్లెటే కాదు ఆల్క‌హాలిక్‌, నాన్-ఆల్క‌హాలిక్ బేవ‌రేజీలు కూడా ఇదే బ్రాండ్ పేరుతో విడుద‌ల అయ్యాయి. స్టార్ట‌ప్ కంపెనీ అయిన 7InkBrews ఈ చాక్లెట్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ముంబైకి చెందిన ఈ కంపెనీని మోహిత్ భాగ్‌చందానీ ప్రారంభించిన ఈ కంపెనీలో ఇప్పుడు ధోనీ కూడా షేర్ హోల్డ‌ర్ కావ‌డం మరో విశేషం.

ఈ కంపెనీలో షేర్‌హోల్డ‌ర్ అవ‌డమే కాదు..ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కావటం చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు ధోనీ. ప్ర‌స్తుతం ముంబై, పుణె, గోవా, బెంగ‌ళూరుల్లో ఈ ప్రోడ‌క్ట్ లాంచ్ అయింది. ఆ తరువాత దీన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, జార్ఖండ్‌, పంజాబ్‌, చండీగ‌ఢ్‌ల‌లో కూడా అందుబాటుతోకి తీసుకురానున్నారని కంపెనీ ప్రతినిథులు తెలిపారు.