పుల్వామా ఉగ్రదాడి : జవాన్లను చంపిన నరహంతకుడు వీడే

10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించారు. భారీ

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 03:45 PM IST
పుల్వామా ఉగ్రదాడి : జవాన్లను చంపిన నరహంతకుడు వీడే

10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించారు. భారీ

10మంది కాదు, 20 మంది కాదు.. ఏకంగా 42మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అదను చూసి దొంగదెబ్బ కొట్టాడు. రక్తపుటేరులు పారించాడు. మారణహోమం సృష్టించాడు. భారీ ఉగ్రదాడితో యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేశాడు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జవాన్లే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. పుల్వామా జిల్లా అవంతిపొరా ప్రాంతంలో CRPF జవాన్లను టార్గెట్  చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. కారు బాంబు పేలుడులో 42మంది జవాన్లు మృతి చెందారు. మరో 50మంది జవాన్లకు గాయాలు అయ్యాయి. వారందరిని ఆస్పత్రికి తరలించారు.  గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి తమపనేనని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

 

42మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాది వివరాలు వెలుగులోకి వచ్చాయి. టెర్రరిస్టుల దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాదిని అదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్‌గా పోలీసులు  గుర్తించారు. దాడికి ముందు అతడు ఓ వీడియో సందేశం నెట్ ద్వారా పంపాడు. త్వరలోనే స్వేచ్చ లభిస్తుందంటూ ఆ వీడియోలో అదిల్ అహ్మద్ ప్రకటించాడు. మొత్తం 45 సెకన్ల వీడియోలో అదిల్  అహ్మద్ ప్రసంగం ఉంది. ఈ వీడియో ఎప్పటిది అనేది తెలీకపోయినా.. తాజా దాడికి సంబంధించినదే అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీడియోలో అదిల్ తన రెండు చేతుల్లో ఆటోమేటిక్  రైఫిల్స్ పట్టుకుని..బ్యాక్ డ్రాప్‌లో జైషే మహ్మద్ జెండాతో ఉన్నాడు. ‘ఈ వీడియో మిమ్మల్ని చేరుకునే సమయానికి నేను పరలోకంలో ఉంటాను. జైషే మహ్మద్ సంస్థలో ఏడాది పాటు ఉన్నా. కశ్మీర్  ప్రజలకు ఇదే నా చివరి సందేశం అని’ ఉగ్రవాది అదిల్ చెప్పాడు.

 

జవాన్లపై అటాక్ చేసిన ఉగ్రవాది వకాస్ కశ్మీర్‌కు చెందినవాడే. దక్షిణ కశ్మీర్ కాకపోరా జిల్లాకు చెందిన వకాస్ జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థలో ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏడాదిపాటు శిక్షణ  తీసుకున్నాడు. ఈ విషయాన్ని వకాస్ వీడియో సందేశంలో ఉంది. తనను తాను పేల్చుకుని దాడికి పాల్పడిన వకాస్.. పేలుడుకు ముందు రికార్డు చేసిన వీడియోను జైషే మహ్మద్‌ సంస్థ  విడుదల చేసింది.