Uttarakhand : పులి వల్ల 25 గ్రామాల్లో కర్ఫ్యూ.. పులి దాడిలో మరణిస్తే రూ. 4 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటన
ఓ పెద్దపులి వల్ల 25 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇద్దరిని చంపి తినేసింది. దీంతో ప్రజలు హడలిపోతున్నారు.

Curfew in 25 Uttarakhand villages
Uttarakhand : అదిగో పులి అనే మాట వినిపిస్తోనే ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలోని 25 గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో పులి విచ్చలవిడిగా తిరిగేస్తు కనిపించివారిపై దాడికి చేయటమే కాదు ఇప్పటికే మూడు రోజుల్లో ఇద్దరిని చంపి తినేసింది పెద్దపులి. దీంతో బయటకు రావాలంటేనే పౌరి జిల్లాలోని 25 గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. పులి భయంతో ఆ 25 గ్రామాల్లోను అధికారులు కర్ఫ్యూ విధించారు. కలెక్టర్ ఆదేశాలతో స్కూళ్లు అంగన్వాడీ కేంద్రాలు మూసివేశారు. పౌరి జిల్లా ప్రజలు పులి భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈక్రమంలో అటవీశాఖ అధికారులు పులి దాడిలో మరణిస్తే ..రూ. 4 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. పులి భయంతో 25 గ్రామాల్లో కర్ఫ్యూ విధించామని పౌరి జిల్లా మేజిస్ట్రేటు ఆశిష్ చౌహాన్ తెలిపారు.
పౌరి జిల్లాలో అడవి దాటి ఓ పెద్దపులి ఆ చుట్టు పక్కల 25 గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతోంది. కంటికి కనిపించిన జంతువుల్నే కాదు మనుషుల్ని కూడా తినేస్తోంది. దీంతో ఈ గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మూడు రోజుల్లో ఇద్దరిపై దాడి చేసి చంపి తినేసింది అంటే వారి భయం ఎలా ఉంటుందో ఊహించుకోచ్చు. దీంతో పోలీసులు 25 గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. తుపాకులు చేతపట్టి కాపలా కాస్తున్నారు.
అలా పులి వీరవిహారం చేస్తున్న భయాందోళన పరిస్థితుల్లో సగం తిని వదిలి వెళ్లిన ఓ మృతదేహాన్ని స్థానికులు ఆదివారం (ఏప్రిల్ 16,2023)గుర్తించారని ఫారెస్ట్ రేంజర్ అధికారి మహేంద్ర సింగ్ రావత్ తెలిపారు. ఆ మృతదేహం కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని సిమ్లీ గ్రామంలో సిమ్లీ గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ నేగి అనే వ్యక్తిదిగా గుర్తించామని..రణవీర్ ఒంటిరిగా నివసిస్తున్నారని తెలిపారు. రణవీర్ బంధువులకు విషయం తెలియజేయటానికి ఫోన్ చేసినా వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదని తెలిపారు.
దీంతో ఆ గ్రామస్థులకు సమాచారం ఇచ్చి ఆయన ఇంటికి వెళ్లాలని కోరామని దీంతో వారు రణవీర్ నేగి ఇంటికి వెళ్తుండగా గ్రామస్థులకు దారిలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అతడి ఆచూకీ కోసం గాలించగా.. అతని ఇంటి సమీపంలో మృతదేహాన్ని గుర్తించారని తెలిపారు. మూడు రోజుల్లో పులి ఇద్దరిని చంపేయటంతో స్థానికులు భయపడిపోతున్నారు. పులుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇస్తామని అటవీశాఖ అధికారి తెలిపారు.
ఆ పులిని మనుషుల్ని వేటాడే జంతువు (మ్యాన్ ఈటర్)గా ప్రకటించాలని కోట్‌ద్వార్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ కునర్వార్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీని పేర్కొన్నారు. ఆ పులిని పట్టుకోవటానికి యత్నిస్తున్నామని గ్రామంలో బోన్లు ఏర్పాటు చేసామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. గ్రామస్థులు అడవుల్లోకి వెళ్లొద్దని..వీలైనంత వరకు బయట తిరగవద్దని సూచించారు.