Gold Seized
Gold Seized : బంగారం, నగదు తరలించడంలో ప్రయాణికులు తెలివి మీరిపోయారు. కాదేది కవితకు అనర్హం అన్నట్లు పాల ప్యాకెట్లు, క్రెడిట్ కార్డులు వాడేస్తున్నారు. ఎక్కడెక్కడో దాచుకున్న సొమ్మంతా కష్టపడి తెచ్చుకుంటూ ఈజీగా దొరికిపోతున్నారు. తాజాగా ఇటు ఢిల్లీ, అటు చండీగఢ్‌లలో భారీ మొత్తంలో తరలిస్తున్న బంగారం, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయుడి నుంచి రూ.2.24 కోట్ల విలువైన 4,204 గ్రాముల బంగారపు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. పాల ప్యాకెట్లలో బంగారం బిస్కెట్లు దాచిన ఆ ప్రయాణికుడు అధికారులకు దొరికిపోయాడు. పాక్స్ కస్టమ్స్ చట్టం 1962 క్రింద అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న Md అసద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కనిపెట్టలేని విధంగా ట్రాలీ వీల్స్ లో దాచిన 32500 సౌదీ రియాల్ మరియు 150 UAE దిర్హామ్ లు కలిపి సుమారు రూ.7,24,800 విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బంగారం కొంటున్నారా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
చండీగఢ్‌లో కూడా భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. బంగారం బిస్కెట్ తో పాటు క్రెడిట్ కార్డులలో 520 గ్రాముల బంగారపు షీట్లను అమర్చి తీసుకువెళ్తున్న ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రికవరీ చేసిన మొత్తం బంగారం విలువ సుమారు రూ.67.71 లక్షలుగా తెలుస్తోంది. తెలివిగా ప్లాన్ చేసి అధికారుల కన్నుగప్పి బంగారం తరలిద్దామనుకుని పాపం ఆ ప్రయాణికులు ఇలా దొరికిపోయారు.
On the basis of profiling, Customs@IGI Airport have seized gold bars weighing 4204GMs valued at 2.24 Crores brought by One Indian national from Bangkok. The pax has been arrested under Customs Act, 1962. Further, investigations are underway. pic.twitter.com/qOQTd0uwGj
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) November 20, 2023
Vigilant #CISF personnel apprehended a passenger carrying foreign currency; 32500 Saudi Riyal & 150 UAE Dirham (worth approx. Rs 7,24, 800) concealed in wheels of his bag @ IGI Airport, Delhi. The passenger was handed over to Customs.#CISFTHEHONESTFORCE@HMOIndia @MoCA_GoI pic.twitter.com/8qoTfcKHVR
— CISF (@CISFHQrs) November 20, 2023
#WATCH | Chandigarh Customs have recovered one gold biscuit and 5 gold sheets made from rectangular credit cards totally weighing 520 gms. The total gold recovery was 1270 gms valued at approx Rs 67.71 Lakhs. Further investigation is underway: Customs
(Source: Customs) pic.twitter.com/NjepP1OExn
— ANI (@ANI) November 20, 2023