Lakhimpur Kheri: మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అనంతరం వారి చున్నీలతోనే చెట్టుకు ఉరి

బాలికలిద్దరినీ బైక్‭లపై బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ.. జునైద్, సుహైల్‭లతో వారికి ఎప్పటి నుంచో స్నేహం ఉందని, అయితే పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకురావడంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి తీసుకెళ్లిన మూడు గంటల్లోనే వారు చెట్టుకు వేలాడుతూ కనిపించారని బాధిత అక్కాచెల్లెళ్ల తల్లి ఆవేదన వ్యక్తం చేశారు

Lakhimpur Kheri: మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అనంతరం వారి చున్నీలతోనే చెట్టుకు ఉరి

Dalit sisters raped and murdered in Uttar pradesh

Updated On : September 15, 2022 / 11:12 AM IST

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్‭లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపై (ఒకరు 17 ఏళ్లు, మరొకరు 15 ఏళ్లు) సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా వారి చున్నీలతోనే చెట్టుకు ఉరితీశారు. పెళ్లి విషయమై ఒత్తిడి తీసుకురావడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు లఖింపూర్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన గంటల్లోనే ఆరుగురు నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

నేరస్తులు చోటు, జునైద్, సుహైల్, కరీముద్దీన్, ఆరిఫ్, హఫీజ్ ఉర్ రెహమాన్ అని పోలీసులు వెల్లడించారు. వీరిలో జునైద్‮‭ను పట్టుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని, పారిపోతుండే కాలికి బుల్లెట్ దింపినట్లు లఖీంపూర్ ఖేరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ సుమన్ తెలిపారు. చోటు అనే వ్యక్తి మినహా మిగిలిన వారంతా జిల్లాలోని లాల్‭పూర్ గ్రామానికి చెందినవారని, ఇద్దరు బాలికల ఇంటికి సమీపంలోనే చోటు కుటుంబం నివాసం ఉంటుందని పేర్కొన్నారు. ఇతడే బాలికలిద్దరినీ జునైద్, సుహైల్‭కు పరిచయం చేశాడట.

బాలికలిద్దరినీ బైక్‭లపై బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ.. జునైద్, సుహైల్‭లతో వారికి ఎప్పటి నుంచో స్నేహం ఉందని, అయితే పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకురావడంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి తీసుకెళ్లిన మూడు గంటల్లోనే వారు చెట్టుకు వేలాడుతూ కనిపించారని బాధిత అక్కాచెల్లెళ్ల తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల చున్నీలతోనే ఉరి తీశారట. అయితే దానికి ముందు వారిపై అత్యాచారం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బదౌన్‭లో 2014లో జరిగిన దారుణ ఘటనను తాజా ఘటన గుర్తు చేస్తోంది. అప్పట్లో సైతం ఇద్దరు అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసి ఇలాగే చెట్టుకు ఉరితీశారు.

Droupadi Murmu to visit London: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరవుతున్న భారత రాష్ట్రపతి