Stunts in Saree : చీర కట్టులో డాన్సరమ్మ విన్యాసాలు సూపర్ అనాల్సిందే..

రుక్మిణి విజయకుమార్ అనే డ్యాన్సర్ చీరకట్టుతో చేసిన విన్యాసాలు అదరహో అనిపిస్తున్నాయి. గజ్జెలు కట్టుకుని నర్తించినంత ఈజీగా చీరకట్టుతో ఫీట్స్ చేసి ఔరా అనిపిస్తున్నారు డ్యాన్సర్ రుక్మిణీ విజయకుమార్.

Stunts in Saree : చీర కట్టులో డాన్సరమ్మ విన్యాసాలు సూపర్ అనాల్సిందే..

Chennai Chain Snatchers (2)

Updated On : April 14, 2021 / 3:13 PM IST

Dance Rukmini Stunts in Saree : ఈ బిజీ బిజీ లైఫ్ లో ఉద్యోగానికి వెళ్లాంటే చీర కంటే డ్రెస్సే బెటర్. అలాగే కొన్ని కొన్ని ఫీట్స్ చేయాలంటే చీరకంటే డ్రెస్సే సౌకర్యంగా ఉంటుంది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. అసాధ్యం అనేమాట చిటికెలో చేసి చూపించేస్తారు. అలా ఓ మహిళ చీరకట్టులో చేసిన విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుక్మిణి విజయకుమార్ అనే డ్యాన్సర్ చీరకట్టుతో చేసిన విన్యాసాలు అదరహో అనిపిస్తున్నాయి. గజ్జెలు కట్టుకుని నర్తించినంత ఈజీగా చీరకట్టుతో ఫీట్స్ చేసి ఔరా అనిపిస్తున్నారు డ్యాన్సర్ రుక్మిణీ విజయకుమార్.

2

సాధారణంగా స్టంట్స్ చాలామంది చేస్తుంటారు. కానీ అవి అందరూ చేయలేరు. ప్రత్యేకించి కొన్ని రకాల స్టంట్స్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోలో ఒక మహిళ చీరలో డ్యాన్సర్ రుక్మిణీ విజయకుమార్ చేసిన స్టంట్స్ చేసిన విధానం చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. వావ్ వాటే ఫీట్స్ అంటున్నారు.

3

చీరను ధరించి, బ్యాక్‌ఫ్లిప్‌లు, హెడ్‌స్టాండ్‌లు చేస్తుంటే షాక్ అవ్వాల్సిందే. మహామహులకే సాధ్యంకాని ఫీట్స్ ను అందులోని డ్రెస్ వేసుకుని కూడా చేయలేని ఫీట్స్ ని మోముపై చిరునవ్వు చెదరకుండా వెరీ సింపుల్‌గా చేశారు డాన్సర్ రుక్మిణి విజయకుమార్. ఈ ఫీట్స్ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Rukmini

ఈ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఏడు లక్షల మంది చూశారు. 80 వేలకు పైగా లైక్ చేశారు. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ డ్యాన్సర్ రుక్మిణీ విజయకుమార్ చేసిన సూపర్ ఫీట్స్ ని..