VK Singh : రైతు సంఘాలపై కేంద్రమంత్రి ఫైర్

మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించి..రైతులకు క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అయితే రైతులకు మోదీ క్షమాపణ

VK Singh : రైతు సంఘాలపై కేంద్రమంత్రి ఫైర్

Vk Singh

Updated On : November 20, 2021 / 5:55 PM IST

VK Singh మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించి..రైతులకు క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అయితే రైతులకు మోదీ క్షమాపణ చెప్పిన ఒక్కరోజు తర్వాత ఆయన కేబినెట్ సహచరుడు రైతు సంఘాలపై తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. కొందరు రైతులు ఈ చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టడంపై విచారం వ్యక్తం చేశారు.

విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శనివారం విలేఖరులతో మాట్లాడుతూ…”ఓ రైతు నేతతో ఈ చట్టాల గురించి నేను మాట్లాడాను. ఇవి నల్ల చట్టాలు అని అంటున్నారు కదా? వీటిని రాయడానికి వాడిన సిరా తప్ప, నల్లగా ఏం ఉందని అడిగాను. దీనికి ఆ రైతు నేత స్పందిస్తూ..మీ అభిప్రాయం మంచిదే కానీ, ఈ చట్టాలు ఇప్పటికీ నల్లవే’ అని అన్నారు.

అయితే దీనికి పరిష్కారం ఏమిటని నేను ప్రశ్నించినపుడు, పరిష్కారం ఏమీ లేదని ఆయన సమాధానమిచ్చారు. రైతు సంఘాల్లో ఆధిపత్య పోరు ఉంది. చిన్నకారు రైతుల ప్రయోజనాల గురించి వీరు ఆలోచించరు. ఆ కారణం వల్లనే ప్రధాని మోదీ ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు రైతు క్షేమం కోసం స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేసినది బీజేపీనే”అని వీకే సింగ్ అన్నారు. ఇక,వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

ALSO READ Lakshmi Parvati : ఎన్టీఆర్ గుండెపోటుకు చంద్రబాబే కారణం : లక్ష్మీపార్వతి