Delhi Covid Cases : ఢిల్లీలో కోవిడ్ పరిస్ధితిపై నేడు సమీక్ష

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ  డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ  ఈరోజు సమావేశం అవుతోంది.

Delhi Covid Cases :  దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ  డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ  ఈరోజు సమావేశం అవుతోంది. గడచిన నెలరోజుల్లో డీడీఎంఏ  సమావేసం జరగటం ఇది మూడోసారి.  దీన్ని బట్టి ఢిల్లీలో  కోవిడ్ పరిస్ధితి ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీలో కోవిడ్ కేసులు సంఖ్య పెరగటంతో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించి…డీడీఎంఏ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది.

గతంలో జరిగిన భేటీల్లో చర్చించి…. డీడీఎంఏ సూచించిన విధంగానే కేజ్రీవాల్ ప్రభుత్వం వారాంతపు, రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. వచ్చే నెలరోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెపుతున్న నేపథ్యంలో.. తదుపరి చర్యలపై డీడీఎంఏ చర్చించనుంది.

ఢిల్లీలో నిన్న కొత్తగా 22,751 కోవిడ్ కేసులు నమోదు,17 మంది మరణించారు. కరోనా పాజిటివిటి రేటు ఢిల్లీలో 23.5 శాతంగా ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 15,49,730 కరోనా కేసులు నమోదవగా వారిలో 25,160 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 60,733 యక్టీవ్ కేసులున్నాయని ప్రభుత్వం తెలిపింది.
Also Read : Booster Dose : అర్హులైన వారికి నేటి నుంచి బూస్టర్ డోస్
కోవిడ్ కట్టడి కోసం ఢిల్లీ వ్యాప్తంగా 11,487 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ సహా ఎల్లో అలెర్ట్ ఆంక్షలు అమలవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు