Secretary Tenure Extended : హోం,రక్షణ ఐబీ సెక్రటరీలు,రా చీఫ్ పదవీకాలం పొడిగించిన కేంద్రం

కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఐ,ఈడీ చీఫ్ ల పదవీకాలం పొడిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం... తాజాగా రక్షణ శాఖ సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ,

Note

Secretaries Tenure Extended:  కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఐ,ఈడీ చీఫ్ ల పదవీకాలం పొడిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం… తాజాగా రక్షణ శాఖ సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(R&AW) సెక్రెటరీ,ఇంటిలిజెన్స్‌ బ్యూరో(IB) డైరెక్టర్‌ పదవీకాలాన్ని రెండేళ్లు పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సోమవారం(నవంబర్-15,2021) సిబ్బంది,ప్రజా వినతులు మరియు పెన్షన్ మంత్రిత్వశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం..ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని భావించిన సందర్భంలో రక్షణ శాఖ, హోంశాఖ, రా సెక్రెటరీ, సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం సర్వీసు పొడగింపు ఇవ్వొచ్చు.ఈ అధికారుల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు.

కేసు టు కేసు ఆధారంగా మూడు వార్షిక పొడిగింపులను ఇవ్వవచ్చు. అయితే, సర్వీసు పొడగింపునకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. కాగా,2005లో కేంద్ర ప్రభుత్వం ఢిఫెన్స్,హోంశాఖ సెక్రటరీలు,రా చీఫ్,ఐబీ చీఫ్ ల పదవీకాలాన్ని రెండేళ్లకు ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

ALSO READ Manish Tiwari : సీబీఐ,ఈడీ చీఫ్ ల పదవీకాలం పొడగింపుపై సుప్రీంకి విపక్షాలు!