Voters List : మధ్యప్రదేశ్‌లో 11 లక్షల డూప్లికేట్ ఓటర్ల తొలగింపు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 లక్షల బోగస్ ఓట్లను తొలగించింది....

Voters List

Voters List : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 లక్షల బోగస్ ఓట్లను తొలగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు లేవనెత్తింది. మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నేతల బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసి, ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓటర్లను చూపుతున్న రికార్డుల కాపీలను సమర్పించింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా విలేకరులతో మాట్లాడారు.

Also Read : Plane Crash : ఆస్ట్రేలియాలో కూలిన తేలికపాటి విమానం..నలుగురి మృతి

రాష్ట్రంలో 11 లక్షల నకిలీ పేర్లను తొలగించామని, ఓటర్ల జాబితాలను సరిచేసినట్లు ఎన్నికల కమిషన్ తమకు తెలియజేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం 43 జిల్లాలకు సంబంధించిన గణాంకాలతో, ఒకే నియోజకవర్గంలో బోగస్ ఓటర్ల గురించి పోల్ ప్యానెల్‌కు సమర్పించింది. అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛంగా, నిస్పక్షపాతంగా నిర్వహించాలని తాము ఈసీని కోరామని కాంగ్రెస్ నేతలు చెప్పారు.

Also Read :Bus crash : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం..16 మంది మృతి, 29 మందికి గాయాలు