Delhi Aiims To Begin Recruiting Children Between 6 And 12 Years For Covaxin Trial
Delhi AIIMS : ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అంతకంటే చిన్న వయస్సువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 12-18 ఏళ్ల మధ్య వారికి ట్రయల్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై ట్రయల్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ట్రయల్స్ కోసం 6 నుంచి 12 ఏళ్ల పిల్లలను ఎంపిక ప్రారంభమైంది.
బాల వలంటీర్ల ఎంపిక ప్రక్రియ మంగళవారం (జూన్ 15,2021) నుంచి ప్రారంభం కానుందని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేట్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. కాగా..ఈ ఎంపిక పూర్తి అయ్యాక..వారికి వ్యాక్సిన్ వేయటం కూడా పూర్తి అయ్యాక పూర్తిగా వారి అబ్జర్వు చేసిన అనంతం 2 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు.
మరోవైపు, 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలకు భారత్ బయోటెక్‌కు అనుమతి ఇస్తూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) మే 12న ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేయటానికి 175 మంది చిన్నారులను ఎంపిక చేసి వారిని మూడు గ్రూపులుగా డివైడ్ చేసి.. టీకా పరీక్షలు నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఇచ్చి వేయనున్నారు.