Delhi : ప్రధాని మోడీతో ఏపీ గవర్నర్ భేటీ..సాయంత్రం రాష్ట్రపతితో సమావేశం..

ప్రధాని మోడీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. గవర్నర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

AP Governor meets Prime Minister Modi : ప్రధాని మోడీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. గవర్నర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి సంబంధించి పలు నివేదికలతో బిశ్వభూషణ్ విజయవాడ నుంచి భువనేశ్వర్ వెళ్లగా.. శుక్రవారం (ఏప్రిల్ 22,2022) అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న గవర్నర్ ఈరోజు ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ప్రధానికి ఏపీకి సంబంధించి పలు నివేదికలు అందించారు. ఈరోజు (శనివారం) సాయంత్రం గవర్నర్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కూడా భేటీకానున్నారు.అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కూడా సమావేశమయ్యారు.

అయితే ఏపీ గవర్నర్ హరించందన్ మర్యాదపూర్వకంగానే ప్రధాని మోదీని కలుస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితుల కారణంగా చాలాకాలంగా ఆయన ప్రధానిని కలవలేకపోయారని. .అందువల్లే ఇప్పుడు కలుస్తున్నారని వివరణ ఇచ్చాయి. అయితే ప్రధానితో భేటీలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై గవర్నర్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఆ అంశాలపై ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

అలాగే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల జరుగనున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాగా..కొన్ని రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా  ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ప్రధానితో పలు రాష్ట్రాల గవర్నర్లు సమావేశం కావటం గమనించాల్సిన విషయం.

ట్రెండింగ్ వార్తలు