మహిళల భద్రతే ముఖ్యం :ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్‌ సంఖ్య 13వేలకు పెంపు

  • Published By: veegamteam ,Published On : October 28, 2019 / 10:53 AM IST
మహిళల భద్రతే ముఖ్యం :ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్‌ సంఖ్య 13వేలకు పెంపు

Updated On : October 28, 2019 / 10:53 AM IST

ఢిల్లీలో మహిళల రక్షణ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం బస్సుల్లో మార్షల్స్ ను నియమించిన విషయం తెలిసిందే. 3 వేల 400ల మందిని నియమించిన సీఎం ఆ సంఖ్యను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. త్యాగరాజ్‌ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..మహిళలు, యువతులు తమ ఇంటిలో ఉన్నంత భద్రతగా ప్రభత్వ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. 

అటువంటి భద్రతను కల్పిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం బస్సుల్లో మార్షల్స్‌ సంఖ్య 3400 ఉండగా..మంగళవారం నుంచి అంటే అక్టోబర్‌ 29 నుంచి 13000 మంది మార్షల్స్‌ మహిళలు, యువతుల భద్రత కోసం సేవలు అందిస్తారని తెలిపారు.
ఢిల్లీ నగరం ఓ పెద్ద కుటుంబంలాంటిది. ఈ కుటుంబానికి నేను పెద్ద కొడుకును. నా తల్లులు, అక్కచెల్లెళ్ల భద్రత నా బాధ్యత అని..అందుకే ప్రభుత్వానికి భారమైన ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నా తల్లులు..అక్క చెల్లెళ్ల భద్రత ముందు ఈ ఖర్చు లెక్కలోది కాదని అన్నారు.  ఇటువంటి ఏర్పాటు ఎక్కడా లేదని అన్నారు. కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.