“ఢిల్లీ కరోనా”…కోవిడ్-19పేషెంట్ల కోసం కొత్త యాప్ లాంఛ్ చేసిన కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : June 2, 2020 / 09:54 AM IST
“ఢిల్లీ కరోనా”…కోవిడ్-19పేషెంట్ల కోసం కొత్త యాప్ లాంఛ్ చేసిన కేజ్రీవాల్

Updated On : June 2, 2020 / 9:54 AM IST

దేశరాజధానిలోని హాస్పిట‌ళ్ల‌లో అందుబాటులో ఉన్న కోవిడ్-19 బెడ్స్ బెడ్స్‌ కు సంబంధించిన స‌మాచారంతో ఓ కొత్త యాప్ “ఢిల్లీ కరోనా”ను సీఎం కేజ్రీవాల్ ఇవాళ(జూన్-2,2020)లాంఛ్ చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని..కానీ తాము తగిన ఏర్పాట్లు చేసినందువల్ల కరోనా పేషెంట్లు వద్యసదుపాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసర లేదన్నారు.

ఓ కుటుంబంలో ఎవరికనా కరోనా వస్తే…అప్పుడు వారు అవసరమైన మెడికల్ సర్వీసెస్ ను పొందుతారని ఆప్ అధినేత తెలిపారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో నాలుగు అడుగులు ముందే ఉన్నామ‌న్నారు. హాస్పిట‌ళ్ల‌లో బెడ్లు, ఐసీయూలు, వెంటిలేట‌ర్లు అన్నీ అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.  హాస్పిట‌ళ్ల‌లో మంచాలు, వైద్య స‌దుపాయాల లోటు ఉన్న‌ట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని, ప్ర‌స్తుతం ఢిల్లీలో సుమారు 4,100 బెడ్స్ ఖాళీగా ఉన్న‌ట్లు కేజ్రీవాల్ తెలిపారు.

అయితే భ‌విష్య‌త్తులో ఇలాంటి ఫిర్యాదు రాకుండా ఉండేందుకు… యాప్‌ను ఆవిష్క‌రించిన‌ట్లు సీఎం చెప్పారు. ఆ యాప్ ద్వారా ఢిల్లీలో ప్రైవేటు, ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల స‌మాచారాన్ని ప్రజలు పొందుతారన్నారు. ప్ర‌తి హాస్పిట‌ల్‌లో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయో ఆ యాప్ ద్వారా తెలుస్తుంద‌న్నారు.  ప్ర‌స్తుతం ఢిల్లీలో 302 వెంటిలేట‌ర్లు అందుబాటులో ఉన్న‌ాయని,ఇందులో 210 ఖాళీగా ఉన్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు హాస్పిట‌ల్ స‌మాచారంతో యాప్‌ను అప్‌డేట్ చేస్తామ‌న్నారు. 

అంతేకాకుండా హాస్పిటల్స్ ,బెడ్స్ సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 1031కు ఫోన్ చేయవచ్చునని, ఢిల్లీ హాస్పిటల్స్ లో బెడ్స్ లభ్యత గురించిన సమాచారాన్ని ఓ SMS లేదా మెసేజ్ ద్వారా పంపబడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. తాము విడుదల చేసిన యాప్ లో బెడ్స్ అందుబాటులో ఉన్నాయని చూపించినా కూడా  బెడ్ ను కేటాయించేందుకు హాస్పిటల్స్ నిరాకరిస్తే… ఫిర్యాదు చేసేందుకు 1031 నెంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌న్నారు. తమ సెక్రటరీ వెంటనే చర్య తీసుకుంటారని,హాస్పిటల్ అధికారులతో మాట్లాడి స్పాట్ లో ప్రజలకు బెడ్ కేటాయించే విధంగా చేస్తారని తెలిపారు.

Read: వలస కార్మికుల సామాన్లు మోస్తూ 80ఏళ్ల కూలీ ఉచిత సాయం