Manish Sisodia
Manish Sisodia : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ మే 12వ తేదీ వరకు పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. మనీశ్ సిసోడియా జ్యడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కస్టడీ ముగియడంతో మనీశ్ సిసోడియాను అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున సిసోడియా కస్టడీ పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకుని సిసోడియా కస్టడీని పొడిగించింది నాగ్ పాల్ ధర్మాసనం. లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. తాము విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీ స్కామ్.. “లోతైన పాతుకుపోయిన కుట్ర”గా ఇటీవలే ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ తెలిపింది.