Vinay Mohan Khwatra : సూడాన్ నుంచి 600 మంది భారతీయులను ఢిల్లీ, ముంబైకి తరలించాం : విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ ఖ్వాత్ర

జేడ్డాలో, పోర్ట్ సూడాన్ లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సూడాన్ పరిస్థితిపై ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపామని, గత శుక్రవారం ప్రధాని స్వయంగా ఒక సమీక్ష సమావేశం జరిపారని వెల్లడించారు.

Vinay Mohan Khwatra : సూడాన్ నుంచి 600 మంది భారతీయులను ఢిల్లీ, ముంబైకి తరలించాం : విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ ఖ్వాత్ర

Vinay Mohan Khwatra

Vinay Mohan Khwatra : ఏప్రిల్ 15 నుంచి సూడాన్ లో పరిస్థితి యుద్ధంలా తయారైందని, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్ర తెలిపారు. చాలా సార్లు సీజ్ ఫైర్ అని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, గ్రౌండ్ లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. సీజ్ ఫైర్ ఉల్లంఘనలు చాలా చోట్ల చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఆపరేషన్ కావేరి చేపట్టి అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చే పని మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఎంత మంది భారతీయులు అక్కడ ఉన్నారన్న అంశంపై స్పష్టత లేదన్నారు. అయితే  3,000 మందికి పైగా భారతీయులు ఉన్నారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.

ఎప్పుడైతే సమస్య మొదలైందో, అప్పటి నుంచే ఎప్పటికప్పుడు భారతీయులకు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చామని తెలిపారు. సూడాన్ రాజధాని ఖార్తుం సహా ఆ దేశంలోని అన్ని పట్టణాల్లో కూడా అలెర్ట్ మెసేజ్ పంపామని చెప్పారు. అక్కడున్న భారతీయుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఆన్ లైన్ విధానంలో ఈ ప్రక్రియ చేపట్టగా 3,400 మంది భారతీయులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఢిల్లీలో విదేశాంగ శాఖ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

Operation Kaveri : సూడాన్ నుంచి ప్రాణాలతో వస్తామనుకోలేదు .. సురక్షితంగా తీసుకొచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు

జేడ్డాలో, పోర్ట్ సూడాన్ లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సూడాన్ పరిస్థితిపై ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపామని, గత శుక్రవారం ప్రధాని స్వయంగా ఒక సమీక్ష సమావేశం జరిపారని వెల్లడించారు. రెండు సీ-130 వాయుసేన విమానాలు, మూడు నావికాదళ నౌకలు(INS సుమేధ, INS తేగ్, INS తర్కష్) భారతీయుల తరలింపు ఆపరేషన్ లో భాగమయ్యాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు (నార్త్ సూడాన్) తరలి రావాల్సిందిగా భారతీయులకు సుచించామని పేర్కొన్నారు.

యుద్ధ సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సహా తరలింపు ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ ఖార్తుం నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఖార్తుం నుంచి పోర్ట్ సూడాన్ కు, అక్కడి నుంచి జెడ్డాకు, అక్కడి నుంచి భారత్ కు.. ఇలా తరలింపు ప్రక్రియ సాగుతోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 600 మంది భారతీయులను ఢిల్లీ, ముంబై నగరాలకు తరలించామని పేర్కొన్నారు.

Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న మొదటి విమానం.. 360 మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి

జెడ్డాలో భారతీయులను రిసీవ్ చేసుకుని భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భారత్ కు చేరుకున్న తర్వాత వారిని వారి వారి సొంత రాష్ట్రాలకు తరలించే విషయంలో అయా రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు సూచనలు చేశామని పేర్కొన్నారు. 42 మంది భారతీయులు బోర్డర్ దాటి సౌత్ సూడాన్ కు చేరుకున్నట్లు తెలిసిందన్నారు. అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల ప్రజలను కూడా వారు కోరితే రెస్క్యూ చేస్తామని చెప్పారు.

ఈ ఆపరేషన్ లో భారత్ కి సౌదీ అరేబియా ఎంతో సహాయం చేస్తోందని కొనియాడారు. అక్కడ అంతర్యుద్ధంలో ఉన్న రెండు గ్రూపులు(RSF రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, SAF సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్)తో సంప్రదింపులు జరిపి, భారతీయుల సేఫ్ పాసేజ్ కల్పించాలని కోరామని తెలిపారు. కొన్ని ప్రాంతాలు ఒకరి కంట్రోల్ లో ఉంటే మరికొన్ని ప్రాంతాలు మరో గ్రూపు కంట్రోల్ లో ఉన్నాయన్నారు. ఖార్తుం సిటీ సహా యుద్ధ భూమి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 వేల మంది బయటపడ్డారని భావిస్తున్నామని వెల్లడించారు.

Sudan Crisis: సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారికోసం.. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూం

అక్కడ చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షితంగా రెస్క్యూ చేయాలన్నదే తమ ప్రయత్నం, లక్ష్యమని స్పష్టం చేశారు. భారతీయ మూలాలు ఉన్న 900 మందికి కూడా సహాయం అందజేస్తున్నామని తెలిపారు. వారంతా సుమారు 400 ఏళ్లుగా అక్కడే ఉంటున్నప్పటికీ భారత్ తో విడదీయలేని అనుబంధం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.