రిజర్వుడు స్థానాలన్నీ ఆప్ చేతుల్లోకే!

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కేజ్రీవాల్.. రిజర్వుడు నియోజకవర్గాల్లో తిరుగులేని విజయం అందుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో రికార్డు క్రియేట్ చేసింది.
ఎస్‌సీ అభ్యర్థులకు కేటాయించిన 12 స్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ తిరుగులేని విజయం దక్కించుకుంది. ఢిల్లీ ఓటర్లలో దాదాపు 12 శాతం దళిత సామాజిక వర్గానికి చెందినవారు ఉండగా.. ఆ సామాజిక వర్గానికి కేటాయించిన 12 సీట్లు ‘ఆప్’ గంపగుత్తాగా తన ఖాతాలో వేసుకుంది.
రిజర్వుడు స్థానాల్లో బీజేపీ నేత రవీందర్ కుమార్ మాత్రమే ‘ఆప్’ అభ్యర్థులకు కాస్త పోటీ ఇచ్చినా చివరకు మాత్రం ఓటమిపాలు కాక తప్పలేదు. భావన స్థానం నుంచి పోటీ చేసిన రవిందర్ ఆప్ నేత జై భగవాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
2015 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందిన ఆప్ నేత వేద్ ప్రకాశ్.. ఆ తర్వాతి కాలంలో బీజేపీ చేరిపోయారు. 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ నేత రాంచందర్ ఈ స్థానం నుంచి గెలిచినప్పటికీ, ఆయనపై వ్యతిరేకత కారణంగా ఈసారి ఆ స్థానాన్ని జైభగవాన్‌కు కేటాయించింది ఆమ్ ఆద్మీ పార్టీ.