Puri Jagannath: ఉచిత తీర్థయాత్ర స్కీంలోకి పూరి జగన్నాథ్ యాత్ర

సీనియర్ సిటిజన్లను ఉచితంగా పూరి జగన్నాథ్ యాత్రకు తీసుకెళ్లనుంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ స్కీం గురించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. రథ యాత్రలో 2020, 2021లలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా సాధారణ ప్రజానీకాన్ని అనుమతించలేదు.

 

 

Puri Jagannath: సీనియర్ సిటిజన్లను ఉచితంగా పూరి జగన్నాథ్ యాత్రకు తీసుకెళ్లనుంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ స్కీం గురించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. రథ యాత్రలో 2020, 2021లలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా సాధారణ ప్రజానీకాన్ని అనుమతించలేదు. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత ఏడాది యాత్ర జులై 1నుంచి ప్రారంభమైంది. గవర్నమెంట్ అఫీషియల్స్ డేటా ప్రకారం.. ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద పెద్ద వయస్కులైన వారిని జులై 11 నుంచి జులై 28వరకూ ఉచితంగా తీసుకెళ్తారు.

ఢిల్లీ గవర్నమెంట్ తీర్థ యాత్ర వికాస్ సమతి చైర్మన్ కమల్ బన్సాల్ మాట్లాడుతూ.. “పూరీ జగన్నాథ్ యాత్ర చాలా పవర్‌ఫుల్. సీఎం కేజ్రీవాల్ సూచనల మేరకు సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత తీర్థయాత్ర స్కీం తీసుకొచ్చాం. చారిత్రక యాత్రకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాం. జులై నెలలో యాత్ర కోసం రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి” అని పేర్కొన్నారు.

Read Also : ఉచిత తీర్థయాత్ర‌లకు కేజ్రీవాల్ హామీ..గోవాలో గెలిస్తే ఉచిత అయోధ్య రామ దర్శనం

తమిళనాడులోని వేలంకని చర్చికి ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రను అందించగా.. తక్కువ స్పందన వచ్చింది. నవంబర్‌లో, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద తీర్థయాత్రల జాబితాలో ప్రముఖ చర్చిని చేర్చినట్లు ప్రకటించారు.

దీనికి సంబంధించి తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అభివృద్ధికి సన్నిహిత అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు