kejriwal : ఉచిత తీర్థయాత్ర‌లకు కేజ్రీవాల్ హామీ..గోవాలో గెలిస్తే ఉచిత అయోధ్య రామ దర్శనం

 దేశ రాజధాని నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని

kejriwal : ఉచిత తీర్థయాత్ర‌లకు కేజ్రీవాల్ హామీ..గోవాలో గెలిస్తే ఉచిత అయోధ్య రామ దర్శనం

Kejriwal (1)

kejriwal దేశ రాజధాని నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పిస్తున్నారు.

ఇవాళ గోవాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కేజ్రీవాల్.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వ‌స్తే హిందువుల‌కు అయోధ్య, క్రైస్తవుల‌కు వేలాంక‌ని, ముస్లింల‌కు అజ్మీర్‌కు ఉచిత యాత్రా సౌక‌ర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు‌. అంతేకాకుండా షిర్డీ సాయిబాబాను ఆరాధించే వారి కోసం ఉచిత షిర్డీ యాత్ర అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

కాగా, గోవా ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధిస్తే గోవా ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వ‌డంతో పాటు యువ‌త‌కు పెద్ద‌సంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని కేజ్రీవాల్ ఇప్ప‌టికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ALSO READ Firecrackers Banning : బాణసంచా నిషేధంపై కోల్ కతా హైకోర్టు ఉత్తర్వుని కొట్టేసిన సుప్రీం