Firecrackers Banning : బాణసంచా నిషేధంపై కోల్ కతా హైకోర్టు ఉత్తర్వుని కొట్టేసిన సుప్రీం

రాబోయే పండుగుల సీజన్‌లో వెస్ట్ బెంగాల్‌ లో బాణసంచా వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాణసంచాపై

Firecrackers Banning : బాణసంచా నిషేధంపై కోల్ కతా హైకోర్టు ఉత్తర్వుని కొట్టేసిన సుప్రీం

Sc

Firecrackers Banning రాబోయే పండుగుల సీజన్‌లో వెస్ట్ బెంగాల్‌ లో బాణసంచా వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదంటూ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని, సక్రమ అమలను పర్యవేక్షించేందుకు అవసరమైన యంత్రాగాన్ని పటిష్టం చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దీపావళి, కాళీ పూజ, ఛఠ్​ పూజ, జగధాత్రి పూజ, గురునానక్​ జయంతి వంటి ఉత్సవాల్లో బాణసంచా కాల్చకుండా నిషేధం విధిస్తూ అక్టోబర్​ 29న కోల్​కతా హైకోర్టు ఆదేశాలిచ్చింది. కరోనా నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మైనపు, నూనె దివ్వెలను మాత్రం వెలిగించుకోవచ్చని చెప్పింది. ఈ ఆదేశాలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్​, జస్టిస్​ అజయ్ రస్తోగితో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారించింది. బాణసంచాను ఈ ఏడాది పూర్తిగా నిషేధించాలని కోల్​కతా​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే వాటిపై నిషేధం మినహా బాణసంచాపై పూర్తి నిషేధం లేదని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పు చెప్పిందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని, పశ్చిమబెంగాల్ ఇందుకు మినహాయింపు కాదని తెలిపింది. హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేముందు సంబంధిత పార్టీలను పిలిపించి వారి వాదన విని ఉండాల్సింది” అని ధర్మాసనం పేర్కొంది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించేలా చర్యలు చేపట్టేందుకు బంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది.

కాగా,బేరియం లవణాలు ఉన్న బాణసంచాపై ఇటీవలే సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయంమ తెలిసిందే. ఉత్సవాల పేరుతో ఇతరుల ప్రాణాలకు హాని తలపెడితే వారి హక్కుకు భంగం కల్గించినట్లే పేర్కొంది. హరిత టపాసులకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పింది.

ALSO READ Congress Membership Drive : దేశవ్యాప్త కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం..డిజిటల్ గా కూడా