Congress Membership Drive : దేశవ్యాప్త కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం..డిజిటల్ గా కూడా

దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరేలా చూడాలని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ హైకమాండ్ సూచి

Congress Membership Drive :  దేశవ్యాప్త కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం..డిజిటల్ గా కూడా

Congress

Congress Membership Drive దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరేలా చూడాలని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. జాయిన్‌ కాంగ్రెస్-సేవ్ఇండియా అనే పేరుతో ఆన్ లైన్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్…రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేసింది.

వచ్చే ఏడాది మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 5 రూపాయలు చెల్లించి ప్రజలు కాంగ్రెస్ సభ్యత్వం పొందవచ్చని.. డిజిటల్​ రూపంలోనూ మెంబర్​షిప్​ ను తీసుకోవచ్చని తెలిపింది. అయితే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు మందు,డ్రగ్స్ కు దూరంగా ఉన్నట్లు ధ్రువీకరించాలని మరియు పార్టీ విధానాలను బహిరంగ వేదికలపై విమర్శించబోమని హామీ ఇవ్వాల్సి ఉంటుందని పార్టీ స్పష్టం చేసింది.

పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిన అనంతరం.. వచ్చే ఏడాది జులై 21-ఆగస్టు 20 మధ్య పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆగస్టు 21-సెప్టెంబరు 20 మధ్య కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.

ALSO READ Biometric : ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ అటెండెన్స్.. కేంద్రం కీలక నిర్ణయం