Biometric : ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ అటెండెన్స్.. కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని స్థాయిలలోని ఉద్యోగులకు..

Biometric : ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ అటెండెన్స్.. కేంద్రం కీలక నిర్ణయం

Biometric

Biometric : ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని స్థాయిలలోని ఉద్యోగులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను మళ్లీ అమలు చేయనుంది. అలాగే బయోమెట్రిక్ మెషిన్ల పక్కనే శానిటైజర్లు ఉండేలా చూసుకోవాలని విభాగాధిపతులను సూచించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఉద్యోగులకు గతంలో బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వగా.. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.

Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుందా?..

“ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు వేసేటప్పుడు ఆరు అడుగుల భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే రద్దీని నివారించేందుకు అదనపు బయోమెట్రిక్ మెషిన్లను కూడా అమర్చండి” అని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉద్యోగులందరూ అన్ని సమయాల్లోనూ మాస్క్‌లు, లేదా ఫేస్ కవర్లను ధరించాలని సూచించింది.

Elon Musk To WFP : రూ. 45వేల కోట్లు ఇస్తా..ఆకలి సమస్య తీర్చగలరా?

అయితే, మీటింగ్స్ విషయానికి వస్తే.. సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం సూచించింది. అధికారులు, సిబ్బంది అందరూ ఆఫీసు వేళల్లో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.