Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలుచేస్తుందా?..

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే తర్వాతి రోజు పనిలో నిరాసక్తంగా ఉంటారు.  పగటిపూట నిద్ర వచ్చేస్తుంది. ఏ పనీ సరిగా చేయలేని స్ధితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలుచేస్తుందా?..

Sleeping

Sleep : ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యం. ప్రశాంతమైన నిద్ర వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. చాలా మంది రాత్రి సమయంలో సరిగా నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు. నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా అది రాదు. రాత్రంతా నిద్రలేని వారు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. నీరసం, బీపీ పెరగడం, కోపం, చిరాకు రావడం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుత జీవన శైలితో చాలా మందిని నిద్ర లేమి సమస్య వేధిస్తుంది. అయితే ఏ వయసు వారు ఎంత నిద్ర పోవాలి అనేది చాలా మందికి తెలియదు.

వయస్సులను బట్టి నిద్రించాల్సిన సమయం కూడా మారుతుంది. చిన్నారులు, యువకులు, వృద్ధులు తమ వయస్సును బట్టీ నిద్రించాల్సిన సమయాన్ని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలు దాదాపు 18 గంటలకు పైగా పడుకుంటే, తొంభై ఏళ్ల వృద్ధులు రోజుకు మూడు నాలుగు గంటలే పడుకుంటారు. వయసు పెరుగుతున్నకొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతుంటుంది. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రకారం 3 నుంచి 5ఏళ్ల పిల్లలు 13 గంటల వరకు నిద్రపోతారు. 13 నుంచి 18 ఏళ్ల పిల్లలు 10 గంటలు నిద్రపోతారు. 18 నుంచి 60 ఏళ్ల వరకు ఏడెనిమిది గంటలు నిద్రపోతారు.

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే తర్వాతి రోజు పనిలో నిరాసక్తంగా ఉంటారు.  పగటిపూట నిద్ర వచ్చేస్తుంది. ఏ పనీ సరిగా చేయలేని స్ధితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలినంత నిద్రపోకుండా వాహనాలు, ఇతర మోటార్లు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన నిద్రలేకపోతే పిల్లల్లో ఏకాగ్రత కొరవడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మలబద్ధకం వస్తుంది. జీర్ణక్రియ సాఫీగా ఉండదు. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. నిద్ర అలసిపోయిన శరీరానికి విశ్రాంతినిచ్చి, తిరిగి మరుసటిరోజు పనికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

అమెరికాలోని ఓ అధ్యయనం ప్రకారం నిద్రపోయే సమయాన్ని ఓ 2 గంటలు తగ్గించడంతో ఆరువారాల తర్వాత టైప్‌-2 డయాబెటిస్‌ లక్షణాలు కనిపించాయి. ప్రతిరోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే శరీరం మీద అతి పలుచని, లేదా బరువు గల దుప్పటి కప్పుకోకుండా, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. దుస్తులు కూడా బిగుతుగా లేకుండా చూసుకోవాలి. గదిలో బాగా చీకటి ఉంటేనే మంచి నిద్ర పడుతుంది. నిద్రకు కాఫీ, టీ, ధూమపానం కూడదు. సెల్‌ఫోన్‌, టీవీలు బెడ్‌మీద చూడకూడకుండా ఉండటం మంచిది. నిత్యం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే ప్రశాంతమైన నిద్ర అవసరం అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.