×
Ad

Video: ఫుడ్‌ డెలివరీ తెప్పించుకుని, డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా.. ఈ టీచర్ ఏం చేశాడో చూడండి.. ఇలాంటి వాళ్లూ ఉంటారా?

ఆ కస్టమర్‌ను పోలీసులు బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Viral Video: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఫుడ్‌ డెలివరీ తెప్పించుకుని డబ్బులు ఇవ్వలేదు. అతడు ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు ఫోన్ చేశాడు. ఇద్దరు పోలీసులు వచ్చారు. పోలీసులతో కూడా ఆ కస్టమర్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఢిల్లీ నరేలా ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఆ కస్టమర్‌ను పోలీసులు బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ కస్టమర్ ఇంటి బయట సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వైద్య పరీక్షలో ఆ కస్టమర్ మద్యం తాగినట్లు తేలింది. అతి పేరు రిషి కుమార్‌ అని, అతడు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.

Also Read: పోలీసులకు, సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ.. గతంలో ఇచ్చిందే మళ్ళీ వైరల్..

సోమవారం సాయంత్రం అర్జున్‌ అనే ఫుడ్‌ డెలివరీ బాయ్ నరేలా ప్రాంతంలో ఆర్డర్‌ డెలివరీకి వెళ్లగా అక్కడి వ్యక్తులు ఆర్డర్‌ను బలవంతంగా తీసుకుని, డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. అంతేగాక, అర్జున్‌ను తిట్టారని అన్నారు.

తమకు ఫుడ్ డెలివరీ బాయ్‌ కాల్‌ చేశాక ఏఎస్‌ఐ దేశ్‌పాల్‌, కానిస్టేబుల్‌ రవీశ్ అక్కడకు వెళ్లారని తెలిపారు. తనపై దాడి చేసిన వ్యక్తిని అర్జున్‌ చూపించాడని అన్నారు. రిషి కుమార్‌ను ఏమైందని అడిగితే అతడు పోలీసులకు దుర్భాషలాడాడని తెలిపారు. రిషి కుమార్ మత్తులో ఉన్నట్లు కనిపించడంతో పోలీసులు తమతో రావాలని చెప్పగా అతడు నిరాకరించాడు.

చివరికి ఇద్దరు పోలీసులు బలవంతంగా రిషి కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్ష చేయించారు. అతడు మద్యం తాగినట్లు తేలిందని అన్నారు. డెలివరీ బాయ్ అర్జున్‌ వద్ద మరిన్ని ఆర్డర్లు ఉండటంతో ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. దీంతో రిషి కుమార్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించామని అన్నారు. రిషి కుమార్‌ని పోలీసులు తీసుకెళ్తున్న వీడియోను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తమ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.