రాజీనామా చేయడానికి కేజ్రీవాల్‌కు 2 రోజుల సమయం ఎందుకని అడిగిన జర్నలిస్టు.. అద్భుతంగా జవాబు చెప్పిన మంత్రి
ఇవాళ ఆదివారం.. ఈద్ ఈ మిలాద్ ఉండడంతో రేపు..

AAP Atishi
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, తాను ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషిగా తేలేవరకు సీఎం పదవి చేపట్టబోనని అన్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ.. ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదు? అని అంటోంది.
ఇదే ప్రశ్నను ఢిల్లీ మంత్రి అతిశీని అడిగాడు ఓ జర్నలిస్టు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి రెండు రోజుల సమయం ఎందుకని అడిగాడు. దీనికి అతిశీ సమాధానం చెబుతూ… ‘ఇవాళ ఆదివారం.. ఈద్ ఈ మిలాద్ ఉండడంతో రేపు కూడా సెలవు దినం. కాబట్టి తదుపరి పని దినం మంగళవారం. అందుకే రాజీనామా చేయడానికి రెండు రోజుల సమయం ‘ అని చెప్పారు.
‘ఇవాళ చరిత్రాత్మక దినంగా గుర్తుండిపోతుంది.. ఎందుకంటే దేశ రాజకీయ చరిత్రలో ఇంతకు ముందు వరకు ఏ నాయకుడూ కేజ్రీవాల్‌లా ఓటు అడగలేదు. తాను నిజాయితీపరుడినని అనుకుంటూనే తనకు ఓటు వేయాలని, లేదంటే వేయకూడదని కేజ్రీవాల్ అన్నారు. అవినీతిని, నిజాయితీలేని తనాన్ని కేజ్రీవాల్ ఉపేక్షించరు.
రాజీనామా చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం బాధలో నుంచి వచ్చింది. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. ఆప్ నేతల్లో కనీసం ఒక్కరి నుంచి కూడా అవినీతికి సంబంధించిన ఒక్క రూపాయిని కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించలేదు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరగాలని మేము డిమాండ్ చేశాం. అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి మద్దతుగా ప్రజలు తీర్పునిస్తారు’ అని అతిశీ అన్నారు.
ఏపీలోని కూటమి సర్కారు కుట్రలు పన్నుతోంది.. అందుకే ఇలా..: బొత్స సత్యనారాయణ