Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ మెడకు బిగిస్తున్న ఉచ్చు.. శిక్షకు అర్హుడేనని తేల్చేసిన ఢిల్లీ పోలీసులు

రెండు కేసుల్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులు రుజువైతే ఆయనకు సుమారు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది

Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ మెడకు బిగిస్తున్న ఉచ్చు.. శిక్షకు అర్హుడేనని తేల్చేసిన ఢిల్లీ పోలీసులు

Brij Bhushan Sharan Singh: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఉచ్చు బిగుస్తోంది. మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. ఆయనపై నమోదైన కేసుల ప్రకారం.. ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో తెలిపారు. బాధితులను లైంగికంగా వెంటబడి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

Katrina Kaif : గత 20 ఏళ్లగా నా లైఫ్‌లోని ఎక్కువ సమయం అతనితో ఉన్నాను.. కత్రినా పోస్ట్ ఎవరి గురించి?

బ్రిజ్ భూషణ్‭కు వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదయ్యాయి. బాధితులను నేరపూరితంగా బెదిరించడం, మహిళల గౌరవ, మర్యాదలను భంగపరచడం, లైంగిక వేధింపులు, వెంటాడటం వంటి నేరాలకు ఆయన పాల్పడినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ కేసులను నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఓ బాధితురాలిపై సింగ్ వేధింపులు పదే పదే కొనసాగినట్లు ఛార్జిషీటులో ఆరోపించారు.

Mahagathbandhan: మరింత పెరిగిన మహాకూటమి బలం.. తాజాగా మరో 8 పార్టీల మద్దతు

రెండు కేసుల్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులు రుజువైతే ఆయనకు సుమారు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 108 మంది సాక్షులను ప్రశ్నించినట్లు, వీరిలో 15 మంది ఈ ఆరోపణలను సమర్థించినట్లు ఢిల్లీ పోలీసులు ఈ ఛార్జిషీటులో పేర్కొన్నారు. ఈ 15 మందిలో రెజ్లర్లు, కోచ్‌లు, రిఫరీలు ఉన్నారని తెలిపారు.