Kidnap : దొంగను కిడ్నాప్ చేసి..స్టేషన్ లోనే బంధించి..రూ.3 లక్షలు డిమాండ్ చేసిన పోలీసులు!
నేరాలను అరికట్టాల్సిన పోలీసులే నేరానికి పాల్పడ్డారు. ఓ దొంగలను కిడ్పాన్ చేసి ఏకంగా స్టేషన్ లోనే బంధించి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

Delhi Police Head Constable Kidnaps Burglar Demanded Rs 3 Lakh Demanded
constable kidnaps burglar : నేరాలను అరికట్టాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడితే ఇక పరిస్థతి ఏంటీ? ప్రజలకు భత్రత కోసం ఎవరిని ఆశ్రయించాలి? హత్యలు, అత్యాచారాలు,దోపిడీలు, కిడ్నాప్ లు జరిగితే న్యాయం కోసం పోలీసుల దగ్గరకెళ్లి మొరపెట్టకుంటాం.అటువంటిది పోలీసులే కిడ్నాపులకు పాల్పడితే..పోలీసు స్టేషనే నేరాలకు అడ్డాగా మారితే ఇక ఎవరికి చెప్పుకోవాలి? అటువంటి ఘటనకు పాల్పడ్డారు ఢిల్లీలోని పోలీస్ కానిస్టేబుల్స్.ఏకంగా ఓ దొంగను కిడ్నాప్ చేసి తమ స్టేషన్ లోనే బంధించి దొంగ భార్యకు ఫోన్ చేసి రూ.3లక్షలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి రావటంతో తోటి పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులే షాక్ అయ్యారు. ఈ నేరానికి పాల్పడిన కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకున్నారు. ఓ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం బయటపడింది.
ఇదంతా వినటానికి ఆశ్చర్యమనిపించినా..ఢిల్లో జరిగింది నిజం. ఓ మహిళ తన సోదరుడిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ పోలీసులకు మే 25న ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్లు ఫోన్ చేయటంతో తన సోదరుడ్ని ఏం చేస్తారో అనే భయంతో తాను ఎలాగోలా కష్టపడి బంధువుల దగ్గర అప్పుచేసి ఎలాగోలా లక్ష రూపాయలు సేకరించి ఆ డబ్బు పట్టుకుని సరాయ్ కాలే బస్టాండ్‌లో ఉన్నానని..కానీ మాకు లక్ష రూపాయలు కాదు..రూ. 3 లక్షలు ఇస్తేనే వదులుతామని డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.
దీంతో వెంటనే మహిళ ఫోన్ చేసిన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వివరాలు అడిగారు. నీ పేరు ఏమిటని అడుగగా..భారతి అని చెప్పింది. తన సోదరుడు వరుణ్‌ను కిడ్నాప్ చేశారని..డబ్బుల కోసం వాట్సాప్ కాల్ చేస్తున్నారని పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే వాట్సాప్ ఫోన్ కాల్ ఆధారంగా విచారించగా బయటపడిన విషయం తెలిసి షాక్ అయ్యారు. తమ విచారణమీద వారికే అనుమానం కలిగింది. కారణం..తమ దర్యాప్తులో జామియా నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాకేశ్ కుమార్, అమీర్ ఖాన్‌ల కస్టడీలో సదరు భారతి సోదరుడు బందీగా ఉన్నట్లుగా తేలింది. పైగా బందీగా ఉన్న వ్యక్తి ఓ దోపిడీ ముఠాలో నిందితుడు. అంటే దొంగ అని తేలింది. దీంతో సాటి పోలీసులే ఓదొంగను కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లుగా గుర్తించారు. అనంతరం సదరు బందీగా ఉన్న వ్యక్తిని విడిపించి..ఆ తరువాత కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్, అతడి సహచరులను అరెస్ట్ చేశారు.
కాగా ఈ బందీలో ఉన్న వ్యక్తి పేరు వరుణ్ గా గుర్తించారు. అతను కొన్ని నెలల క్రితం తన సహచరులతో కలిసి గాంధీనగర్‌లో ఓ వ్యక్తిని దోచుకున్నారని..పోలీసుల ఇన్ఫార్మర్ పోలీసులకు తెలిపాడు.
ఇక పోలీసుల విచారణలో కిడ్నాప్ కు పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ..తన ఇన్ ఫార్మర్ ద్వారా వరుణ్ ఓ దోపిడీకి పాల్పడ్డాడని..ఆ దోపిడీలో వరుణ్ తన వాటా రూ. 1.5 లక్షలు తీసుకున్నాడని..అతడిని కిడ్నాప్ చేస్తే..ఆ సొమ్మును రికవర్ చేసుకోవచ్చని కానిస్టేబుల్‌తో ఆమిర్ అనే ఇన్ ఫార్మర్ చెప్పడంతో వరుణ్ ను కిడ్నాప్‌నకు ప్లాన్ చేసి ఎట్టకేలకు అతడిని కిడ్నాప్ చేసి స్టేషన్ లో నే దాచి పెట్టామని తెలిపాడు హెడ్ కానిస్టేబుల్. అలా కిడ్నాప్ చేసి ఆమె సోదరికి ఫోన్ చేసి రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లుగా తేలింది.
ఈ దోపిడీ జరిగాక..గాంధీనగర్‌లో కేసు నమోదైన విషయం కానిస్టేబుల్‌కు తెలిసి అతడిని కిడ్నాప్ చేస్తే..అతను వాటా డబ్బులతో పాటు కిడ్నాప్ చేసి డిమాండ్ చేసిన డబ్బుల కూడా దోచేయొచ్చని ప్లాన్ వేసిన సదరు హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది. కానీ దొంగ సోదరి ఫిర్యాదుతో మొత్తం ప్లాన్ బెడిసికొట్టింది. దొంగను దోచుకోవాలనుకున్న హెడ్ కానిస్టేబుల్ తో పాటు అతని సహచరుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. బందీగా ఉన్న వరుణ్ ను జామియా నగర్ పోలీస్ స్టేషన్ నుంచి రక్షించిన పోలీసులు.. అప్పటికే అతడిపై దోపిడీ కేసు నమోదై ఉండడంతో అతడిని విడిచిపెట్టకుండా అరెస్ట్ చేశారు. అతడి ఇంటి నుంచి రూ. 1.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.