unknown dead body
Delhi Woman: ఢిల్లీకి చెందిన ఓ మహిళకు తనతో సహ జీవనం చేస్తున్న వ్యక్తి బలవంతపు అబార్షన్లు చేయించడంతో సూసైడ్ కు పాల్పడింది. 33 ఏళ్ల యువతి తన సూసైడ్ నోట్ లో ఇలా 8 సంవత్సరాలుగా జరుగుతుందని పేర్కొంది. జైట్పూర్ ఏరియాలో జులై 5న ఈ ఘటన నమోదైంది.
హిందీలో రాసిన ఆ సూసైడ్ లెటర్ లో… తాను ఓ వ్యక్తితో సహజీవనంలో ఉన్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని రాసింది. చివరికి ఇచ్చిన మాటను పక్కకుపెట్టేసి వదిలేయడంతో ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాను తన భర్తకు దూరంగా ఉంటున్నానని కూడా అందులో పేర్కొంది.
నోయిడాలో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తిపై సూసైడ్ కు కారణమయ్యాడనే నెపంతో కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్ అధికారి అన్నారు.
Read Also : ఇది నేను కోరుకున్న జీవితం కాదు.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్
జులై 5న జైట్పూర్ లో ఓ మహిళ సూసైడ్ చేసకుందని ఫోన్ కాల్ వచ్చింది. ఘటనాస్థలానికి పోలీస్ టీం వెళ్లి వేలాడుతున్న మృతదేహాన్ని దించి ఎయిమ్స్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. స్టూల్ వాడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆ గదిలో బాధితురాలి మొబైల్ దొరకడంతో ప్రాథమిక విచారణ పూర్తి చేశారు.
తన భర్తకు ఏడెనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్న ఆమె డెడ్ బాడీని ముజఫర్ పూర్ లోని పేరెంట్స్ కు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. విచారణలో భాగంగా మహిళ పని చేస్తున్న కంపెనీలోని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.