Aligarh Muslim University: ‘మోదీని పొగిడానని పీహెచ్‌డీ ఆపేశారు.. కోర్టుకెళ్తా’
అలీఘర్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థికి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చేందుకు తిరస్కరించారు. క్యాంపస్ ఈవెంట్ లో భాగంగా గతేడాది జరిగిన కార్యక్రమంలో దనీశ్ రహీం అనే వ్యక్తి ప్రధాని..

Narendra Modi
Aligarh Muslim University: అలీఘర్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థికి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చేందుకు తిరస్కరించారు. క్యాంపస్ ఈవెంట్ లో భాగంగా గతేడాది జరిగిన కార్యక్రమంలో దనీశ్ రహీం అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీని పొగిడినందుకు గానూ పక్కకుపెట్టేశారు. బాధితుడు ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయిస్తూ.. సీఎం యోగి ఆదిత్యానాథ్ తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అతని సబ్జెక్ట్ యోగ్యత పట్ల పీహెచ్‌డీ డిగ్రీ ఇచ్చేందుకు సిద్ధంగా లేమని యూనివర్సిటీ చెబుతుంది. గతేడాది డిసెంబర్ 22వ తేదీ 200వ ఫౌండేషన్ డే సందర్భంగా న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. దాని తర్వాత భాషకు సంబంధించిన శాఖ ఛైర్మన్ పబ్లిక్ లో ప్రధానిని పొగడొద్దంటూ హెచ్చరించారు. అది మన సంప్రదాయం కాదని చెప్పారని మోదీకి రాసిన లెటర్ లో పేర్కొన్నారు.
లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ లో భాగంగా.. లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మీడియా అండ్ మార్కెట్ (LAMM) పీహెచ్‌డీ ప్రోగ్రాంలో అడ్మిట్ అయ్యాడు. లింగ్విస్టిక్స్ లో ఇష్యూ చేసిన అసంపూర్తి పీహెచ్ డీ డిగ్రీని సబ్‌మిట్ చేయాలని.. LAMM అప్పుడే కరెక్ట్ పీహెచ్‌డీ ఇష్యూ చేస్తుందని ఆర్డర్ వేస్తూ రహీమ్ కు ఒక లెటర్ వచ్చింది.
……………………………………..: జొవాద్ తుపాను ఎఫెక్ట్..పలు రైళ్లు రద్దు
దీనిపై అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ రెస్పాండ్ అవుతూ.. ‘పొలిటిక్స్ కారణంగా ఇక్కడేం జరగలేదు. అతను కోర్టుకు వెళ్తానంటే ఎవరూ అడ్డుకోరు. ఇది యూనివర్సిటీ ఉద్దేశ్యం మాత్రమే’ అని ఏఎంయూ అఫీషియ్ స్టేట్మెంట్ ఇచ్చింది.