Dense Fog : పలు రాష్ట్రాల్లో కమ్ముకున్న పొగమంచు.. ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం

దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది....

Dense Fog

Dense Fog : దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచుతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. తమిళనాడు, కేరళలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఎముకలు కొరికే చలితో వణుకుతున్న జనం

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల ప్రజలు ఎముకలు కొరికే చలిలో వణుకుతున్నారు. రాబోయే 48 గంటల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. డిసెంబర్ 26, 27 తేదీల్లో రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలో దట్టమైన దట్టమైన పొగమంచు కురుస్తుందని ఐఎండీ తెలిపింది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు

డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, మహే, పుదుచ్చేరి, కారైకల్ ,లక్షద్వీప్‌లలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.మంగళవారం ఢిల్లీ, పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు ఆవరించింది.

ALSO READ : Romanian flight : ఫ్రాన్స్ విమానం ముంబయిలో ల్యాండింగ్

పొగమంచు వల్ల ఢిల్లీ నివాసితులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగింది. ఢిల్లీ,నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని ప్రాంతాలు మంగళవారం ఉదయం చలి, దట్టమైన పొగమంచుతో మేల్కొన్నాయి. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్,ఒడిశాలోని వివిధ ప్రాంతాలలో చాలా దట్టమైన పొగమంచు ఏర్పడింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, చండీగఢ్, బీహార్, కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్,త్రిపురలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ALSO READ : Earthquake : లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో భూకంపం

ఘజియాబాద్‌లోని ఢిల్లీ-మీరట్ హైవేపై 200 నుంచి 300 మీటర్ల వరకు దృశ్యమానత తక్కువగా ఉంది. ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు హైవేపై పలుచోట్ల పొగమంచు అలర్ట్‌ను ప్రదర్శించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్, పాటియాలలో దృశ్యమానత సున్నా వద్ద నమోదైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పొగమంచుతో కూడిన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యమానత సున్నాకి తగ్గిపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.