Bindaas Dance : మరిది పెళ్లిలో వదిన బిందాస్ డాన్స్

మరది పెళ్లిలో వదిన డాన్స్ చేసింది. వరుడు...వైట్ కలర్ లో కుర్తా..పైజామా..తలపాగ ధరించి ఉన్నాడు. ఎరుపు రంగు లెహంగా ధరించిన..ఆమె..బాలీవుడ్ పాట (లో చలీ మై..అప్నీ దేవర్ కి బారాత్ లేకే)..అనే పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.

Devar Bhabhi Ka Bindaas Dance

Devar Bhabhi : మరిది పెళ్లిలో వదిన చేసిన డాన్స్ కు నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. బాలీవుడ్ లో పాపులర్ సాంగ్…ఈమె చేసిన డాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. మొన్న బావ..మరదలి డాన్స్ కూడా నెటిజన్లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో వివాహం పవిత్రమైన కార్యంగా భావిస్తుంటారు. వారి సంప్రదాయాలను బట్టి వివాహాలను జరిపిస్తుంటారు. వధువు, వరుడు కుటుంబసభ్యులు ఎంతో ఆనందంగా..ఉల్లాసంగా వివాహాల్లో పాల్గొంటారు. ప్రధానంగా..వధువు, వరుడిని పెళ్లి మంటపానికి తీసుకొచ్చే ముందు గానా, భజానా ఏర్పాటు చేస్తుంటారు.

Read More : తెలంగాణకు భారీ వర్ష సూచన

ఇందులో కుటుంబసభ్యులు పాటలకు, మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులు వేస్తుంటారు. కొంతమంది వీటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. తాజాగా..మరది పెళ్లిలో వదిన డాన్స్ చేసింది. వరుడు…వైట్ కలర్ లో కుర్తా..పైజామా..తలపాగ ధరించి ఉన్నాడు. ఎరుపు రంగు లెహంగా ధరించిన..ఆమె..బాలీవుడ్ పాట (లో చలీ మై..అప్నీ దేవర్ కి బారాత్ లేకే)..అనే పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఇతర కుటుంబసభ్యులు చప్పట్లు చరుస్తూ..ఉత్సాహపరిచారు. trendingdulhaniya ఇన్ స్ట్రాగ్రామ్ లో వీడియోను పోస్టు చేశారు.