Makara Jyothi: శబరిమలలో మకరజ్యోతి దర్శనం

పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి.

Makara Jyothi

కేరళలోని శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి. సంక్రాంతి రోజున ఈ దివ్య దర్శనం కోసం అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు.

రవి ధనుస్సు రాశి నుంచి.. మకర రాశిలోకి ప్రవేశించే వేళ… ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవగా.. మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది. స్వామివారి దర్శనాల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాటు చేసింది.

కాగా, భక్తులకోసం ఆలయ అధికారులు కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పంబానది, సన్నిధానం, హిల్‌ టాప్‌తో పాటు టోల్‌ ప్లాజా సమీపంలో అదనపు భద్రత ఉంది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం దాదాపు వందలాది మంది పోలీసులు పనిచేశారు.

Makar Sankranti 2024: పశువులే ప్రాణం: కనుమ రోజు ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో తెలుసా?