Viral Video : కారు పార్కింగ్ విషయంలో వివాదం.. రోడ్డుపై రాడ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్

ఈ ఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Viral Video : కారు పార్కింగ్ విషయంలో వివాదం.. రోడ్డుపై రాడ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్

Noida Car parking dispute

Noida Car parking dispute : నోయిడాలో కారు పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల వారు ఘర్షణకు దిగడంతో రోడ్డుపైనే తోపులాట జరిగింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ కేసుకూడా నమోదైంది.

Also Read : Jharkhand : ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. అమిత్ షాతో చంపయీ సోరెన్ భేటీ.. త్వరలో బీజేపీలోకి

ఏసీపీ శైవ్య గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. కారు పార్కింగ్ విషయంలో స్థానికంగా రెండు కుటుంబాల మధ్య ఈ వివాదం జరిగిందని చెప్పారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ద్వంసం చేశారు. వైరల్ అయిన వీడియోలో.. కర్రలు, ఇనుప రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారుపై అద్దాలను ద్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది.

Also Read : Viral Video : బాబోయ్..! మహిళలూ బైక్ పై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త.. ఈ వీడియో చూడండి..

ఈ ఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘర్షణకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాలకే ఇంత పెద్ద వివాదం చేసి హింసకు దిగడం సరికాదంటూ పేర్కొంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.