DMK MP Senthil Kumar: హిందీ మాట్లాడే రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ దుర్మార్గ వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ

సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఖండించారు. పార్టీ ఆలోచన చాలా బలహీనంగా మారిందని, డీఎంకే అహంకారమే దాని పతనానికి ప్రధాన కారణం అవుతందని అన్నారు

DMK MP Senthil Kumar: హిందీ మాట్లాడే రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ దుర్మార్గ వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ

మంగళవారం లోక్‌సభలో డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందీ బెల్ట్‌లోని రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ తీవ్ర వివాదానికి తెరలేపారు. కాగా సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఉత్తర భారతీయులపై ఇండియా కూటమి భాగస్వామి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై దిగువ సభలో జరిగిన చర్చలో సందర్భంగా.. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీకి అధికారం ఉందని, ఈ రాష్ట్రాలను సాధారణంగా గోమూత్ర రాష్ట్రాలని పిలుస్తామని, దానిపై ఈ దేశ ప్రజలు ఆలోచించాలని అన్నారు.

ఇది కూడా చదవండి: జడ్పీటీసీ మెంబర్ నుంచి చీఫ్ మినిస్టర్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రస్థానం

ఎన్నికల సమయంలో కొందరు డీఎంకే నేతలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రేగిన వివాదాన్ని కాంగ్రెస్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ఉపయోగించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. కాగా, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి.

కాగా మంగళవారం లోక్‌సభలో సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, “మీరు (బీజేపీ) దక్షిణ భారతదేశానికి రాలేదు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో జరిగే పరిణామాలన్నీ మీరు చూస్తున్నారు. మేము అక్కడ చాలా బలంగా ఉన్నాము. అధికారం దక్కలేదని దక్షిణాది రాష్ట్రాల్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే అక్కడ స్థావరం ఏర్పరచుకుని దక్షిణాది మొత్తాన్ని నియంత్రించాలని మీరు కోరుకోరు” అని అన్నారు.

బీజేపీ రియాక్షన్
సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఖండించారు. పార్టీ ఆలోచన చాలా బలహీనంగా మారిందని, డీఎంకే అహంకారమే దాని పతనానికి ప్రధాన కారణం అవుతందని అన్నారు. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని, కర్ణాటకలో కూడా అధికారంలో ఉందని డీఎంకే ఎంపీలు మరిచిపోయి ఉండవచ్చని అన్నామలై అన్నారు. ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమర్థిస్తారా అని కర్ణాటక మాజీ మంత్రి సీటీ రవి ప్రశ్నించారు. ఇదిలావుండగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు తమిళనాడు రాష్ట్ర మంత్రిపై కేసు నమోదు చేసి, అతనిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.. తేల్చి చెప్పిన కాంగ్రెస్