TV news channels : టీవీ న్యూస్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజా సూచన
దేశంలోని టీవీ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా సూచనలు జారీ చేసింది. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేదా ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు చెందిన వ్యక్తులకు టీవీల్లో వేదిక ఇవ్వవద్దని టెలివిజన్ చానెళ్లను కేంద్రం గురువారం కోరింది....

TV news channels
TV news channels : దేశంలోని టీవీ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా సూచనలు జారీ చేసింది. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేదా ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు చెందిన వ్యక్తులకు టీవీల్లో వేదిక ఇవ్వవద్దని టెలివిజన్ చానెళ్లను కేంద్రం గురువారం కోరింది. (Do not give platform to terrorists criminals)
Varanasi : రూ.451 కోట్లతో వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం…రేపు మోదీ శంకుస్థాపన
‘‘దేశంలో చట్టం ప్రకారం నిషేధిత సంస్థకు చెందిన ఉగ్రవాదులతో సహా తీవ్రమైన నేరాల కేసులు ఉన్న విదేశాల్లోని వ్యక్తిని టెలివిజన్ చానెల్‌లో చర్చకు ఆహ్వానించినట్లు మా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది’’ అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. (Government to TV news channels) చర్చకు ఆహ్వానించిన వ్యక్తి భారత దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భారతదేశం యొక్క భద్రత, విదేశాలతో భారతదేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే పలు వ్యాఖ్యలు చేశారని కేంద్రం తెలిపింది.
ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను సమర్థిస్తున్నప్పటికీ, టీవీ చానళ్లు ప్రసారం చేసే కంటెంట్ కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం కింద నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. టెలివిజన్ చానళ్లు తీవ్రమైన నేరాలు,ఉగ్రవాదులు, నిషేధిత సంస్థలకు చెందిన వ్యక్తులకు టీవీల్లో ఎలాంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇవ్వకుండా ఉండాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది.