Union Minister Helps Passenger : విమానంలో తోటి ప్రయాణికుడికి కేంద్రమంత్రి సాయం..ప్రశంసించిన మోదీ

సకాలంలో సాయమందించి తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రిపై నెటిజన్లతో పాటు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. నా సహచరుడు గొప్ప పని చేశాడంటూ మంగళవారం అర్థరాత్రి

Unm

Union Minister Helps Passenger  సకాలంలో సాయమందించి తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రిపై నెటిజన్లతో పాటు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. నా సహచరుడు గొప్ప పని చేశాడంటూ మంగళవారం అర్థరాత్రి మోదీ ట్వీట్ చేశారు.

అసలేం జరిగింది
కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరద్ మంగళవారం రాత్రి ముంబై వెళ్లేందుకు ఢిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎక్కారు. అయితే ఢిల్లీ నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత విమానంలోని ఓ ప్రయాణికుడికి కళ్లు తిరిగి, స్పృహతప్పి పడిపోయాడు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన కేంద్రమంత్రి భగవత్ కరద్ వెంటనే ఆ ప్రయాణికుడికి వైద్య సాయమందించారు. విమానంలోని ఎమర్జెన్సీ కిట్ నుండి రోగికి ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ ఇచ్చారు కేంద్రమంత్రి. రోగి చెమటతో తడిసి ఉన్నాడని, అతని బీపీ తక్కువగా ఉందని కరద్ చెప్పాడు. అతని షర్ట్ తొలగించి ఛాతీకి మసాజ్ చేశారు. దాదాపు 30 నిమిషాల తర్వాత ప్రయాణికుడి పరిస్థితి మెరుగుపడింది. విమానం ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

అయితే భగవత్ కరద్ సమయానికి స్పందించి వైద్య సహాయం చేయకపోతే ఆ వ్యక్తికి మరింత ప్రమాదం జరిగేదని చెబుతున్న తోటి ప్రయాణీకులు మంత్రి చేసిన సహాయాన్ని పొగుడుతూ ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా డాక్టర్ కరాద్ పని తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రిని ప్రశంసిస్తూ, ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. ”మంత్రి తన విధులను నిరంతరాయంగా నిర్వహిస్తున్నందుకు మేము అభినందిస్తున్నాము. తోటి ప్రయాణికుడికి సహాయం చేయడంలో డాక్టర్ భగవత్ కరద్ సహకారం స్ఫూర్తిదాయకం” అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ తన ట్వీట్ లో పేర్కొంది.

ALSO READ Hunger Deaths : దేశంలో ఆకలి చావులు ఉండకూడదు..ఇదే చివరి అవకాశం : సుప్రీంకోర్టు